World Oldest Cake : 80 ఏళ్లనాటి చాక్లెట్ కేకు..ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరకుండా అలాగే..!!

రెండో ప్రపంచ యుద్ధకాలంనాటి ఓ కేకును పరిశోధకులు కనుగొన్నారు. 80 ఏళ్లనాటి చాక్లెట్ కేకు ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది.

World’s oldest wedding cake: జర్మనీలో దహనమైపోయిన ఓ ఇంటిలో సుమారు 88 సంవత్సరాల క్రితం తయారు చేసిన కేకు ఒకటి బయటపడింది. ఓ కేకు తాజాగా లేదు గానీ ఏమాత్రం చెక్కుచెదరకుండా బయట పడటం పరిశోధకులకే ఆశ్చర్యాన్ని కలిగించింది. రెండు మూడు రోజుల్లో పాడైపోయే కేకు ఏకంగా దాదాపు 80 దశాబ్దాలకుపైగా అలా ఎలా ఉందో అని ఆశ్యర్యం కలుగుతోంది..!!

Read more : Cake Slice Auction : వేలానికి 40 ఏళ్ల నాటి కేకు ముక్క ..ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఇల్లంతా కాలిపోయినా ఆ కేకు రూపం మాత్రం చెక్కు చెదరలేదు.! పైగా కేకుపై గార్నిషింగ్‌ కోసం వాడిన చాక్లెట్‌ చిప్స్‌ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కేకు పక్కనే దాన్ని కట్ చేయటానికి పెట్టుకున్న ఓ చాకు..నాలుగు చెంచాలు కూడా దొరికాయి పరిశోధకులకు. ఆ సెటప్ చూస్తే ఎవరి పుట్టినరోజో ఇలా ఇల్లు కాలిపోయ విషాదాంతంగా మారినట్లుగా కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది. ఆ కేకు ఎవరు తయారు చేశారో? ఎవరి కోసం తయారు చేశారో తెలియదు కానీ.. ఆ కేకు మాత్రం ఇన్ని దశాబ్దాల తరువాత కూడా అలనాటి పరిస్థితులను కళ్లకు కడుతోంది. పరిశోధకులు వారి పరిశోధనలో ఆ ఇల్లు జోహాన్ వార్మ్ అనే వ్యక్తిదిగా గుర్తించారు. ఆ ఇల్లు ఎలా కాలిపోయిందో?కూడా తెలుసుకున్నారు.

Read more : Ancient Wine Factory:తవ్వకాల్లో బయటపడ్డ 1500 ఏళ్ల నాటి మద్యం ఫ్యాక్టరీ..పరిశోధనలో విస్తుగొలిపే విషయాలు..

రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో వందలాది ఇళ్లు మంటల్లో కాలి బూడిదైపోయాయి.చారిత్రక జర్మన్ నగరాన్ని బ్రిటీష్ వైమానిక దాడి తర్వాత ‘భారీగా కాలిపోయి నల్లగా’ మారింది. అలా కాలిపోయిన ఇంటిలో ఈ కేకు ముక్క లభ్యమైన ఇల్లు కూడా కాలిపోయింది. ఈ ఇంటితో పాటు ఎన్నో ఇళ్లు కాలిపోయాని ఆ కేకు ముక్క మాత్రం రూపం ఏమాత్రం చెక్కు చెదరకుండా..దాని డెకరేషన్ కు వాడినవి కూడా ఏమాత్రం కాలిపోకుండా స్పష్టంగా కనిపిస్తుండటం నిజంగా మిరాకిల్ అనే చెప్పాలి.

Read more :  Bones Cave : వేల ఏళ్ల నాటి ఎముకల గుహ.. ఇది హైనాల పనేనా? గుట్టు తేల్చిన రీసెర్చర్లు!
ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఏంటంటే.. ఈ కేకులో ఎటువంటి రసాయనాలు లేవని పరిశోధకులు గుర్తించారు. ఈ కేకు ఇలా చెక్కు చెదరకుండా ఉండటానికి గల కారణం ఏంటో? దానికి గల కారణాలేంటో..తాము దీనిపై మరింత పరిశోధనలు చేశాక చెబుతామంటున్నారు పరిశోధకులు.

ట్రెండింగ్ వార్తలు