Wali : వాలి వచ్చేశాడు.. ఇక రష్యా పని అంతే.. రోజుకు 40 మందిని చంపగలడు..!

అతడు గురి పెట్టాడంటే.. బుల్లెట్ దిగాల్సిందే.. శత్రువు ఎంత దూరంలో ఉన్నా సరే.. అతడి తూటాకు దొరికిపోవాల్సిందే. రామాయణంలో వాలి ఎంత బలవతుండో, ఈ వాలి అంతే బలశాలి.

Wali : వాలి వచ్చేశాడు.. ఇక రష్యా పని అంతే.. రోజుకు 40 మందిని చంపగలడు..!

Wali

Updated On : March 12, 2022 / 11:56 PM IST

Wali : అతడు గురి పెట్టాడంటే.. బుల్లెట్ దిగాల్సిందే.. శత్రువు ఎంత దూరంలో ఉన్నా సరే.. అతడి తూటాకు దొరికిపోవాల్సిందే. అతడున్న రేడియస్ లో ఎక్కడైనా అడుగు పెట్టడం అంటే మృత్యువును గంటకొట్టి ఆహ్వానించడమే. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్.. వందమందిని ఒకేసారి రమ్మను అనే డైలాగ్ కూడా అతడికి సరిగ్గా సరిపోతుంది. తన ఎదురుగా శత్రువు ఉన్నాడంటే ఖతం కావాల్సిందే. అతడే వాలి. ద గ్రేట్ స్నైపర్. వరల్డ్ డెడ్లియస్ట్ స్నైపర్. అతడి గురితప్పడం అనేది ఇప్పటిదాకా లేదు.(Wali)

ఈ కెనడియన్ స్నైపర్ ఇప్పుడు రష్యన్ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు. కెనడాకు-రష్యాకు లింక్ ఏంటి అంటే.. రష్యాపై సర్వశక్తులు ఒడి పోరాడుతున్న యుక్రెయిన్ కు నేను సైతం అంటూ మద్దతు తెలుపుతూ యుద్ధభూమిలో వాలిపోయాడు వాలి. ఇప్పటిదాకా ఓ లెక్క.. ఇప్పుడు వాలి వచ్చాడు అన్నట్టు మారిపోయింది అక్కడి సీన్.(Wali)

రామాయణంలో వాలి ఎంత బలవతుండో, ఇప్పటి వాలి కూడా అంతే బలశాలి. అప్పటి వాలి ముందు శత్రువు నిలబడితే అతడి శక్తి మొత్తం వాలికి వెళ్లినట్లు.. ఇప్పటి వాలి ముందు కూడా శత్రువు నిలబడడు. అందుకే అతి శక్తిమంతమైన దేశంపైకి దండెత్తాడు ఈ వాలి. రష్యాకు వ్యతిరేకంగా కదనరంగంలోకి కాలు దువ్వాడు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పిలుపుతో ఆ దేశానికి మద్దతుగా యుద్ధ రంగంలోకి అడుగుపెట్టాడు.

US Restrictions Russia : రష్యాపై ఆంక్షలు మరింత కఠినతరం చేసిన అమెరికా.. సీఫుడ్‌, వొడ్కా, డైమండ్స్ దిగుమతిపై నిషేధం

ప్రపంచం మొత్తంలోనే అత్యుత్తమ స్నైపర్ గా పేరు పొందాడు వాలి. మామూలు స్నైపర్ రోజుకి నలుగురిని లేదా ఐదుగురిని మాత్రమే చంపగలడు. కానీ, వాలి… కనీసం రోజుకు 40మందిని తన తుపాకీకి బలిపెడతాడు. ఎంత దూరంలో ఉన్నా టార్గెట్ ని అయినా ఎంతో ఈజీగా ఛేదిస్తాడీ వాలి. 2017లో 3వేల 540 మీటర్ల దూరంలో అంటే మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐఎస్ జిహాదీని కూడా కాల్చి చంపాడు వాలి. ఇంతటి సుధీర్ఘ దూరంలో ఉన్న లక్ష్యాన్ని చేధించడంలో అతడిదే రికార్డ్.

యుక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ పిలుపుమేరకు బుధవారం వచ్చిన అతడు.. రెండు రోజుల్లోనే ఆరుగురు రష్యా సైనికుల్ని చంపేశాడట..! ఈ వాలి.. ఫ్రెంచ్‌-కెనడియన్ కంప్యూటర్ సైంటిస్ట్. రాయల్ కెనడియన్ రెజిమెంట్‌లో పనిచేశాడు. వాలి అనేది అతడి నిక్‌నేమ్. అరబిక్ భాషలో ఆ పదానికి సంరక్షకుడని అర్థం. తన విధుల్లో భాగంగా అఫ్గాన్‌లో పదుల సంఖ్యలో శత్రువులను మట్టుపెట్టిన క్రమంలో అక్కడి ప్రజలు ఈ పేరు పెట్టారు. ఇక అఫ్గానిస్థాన్‌, ఇరాక్‌, సిరియాలో జరిగిన పోరాటాల సమయంలో అతడి టాలెంట్‌తో గుర్తింపు పొందాడు.

Russia Offered India : భారత్‌కు మరోసారి రష్యా బంపర్‌ ఆఫర్‌

విదేశీయులు వచ్చి తమకు సహకరించాలని ఇప్పుడు జెలెన్‌స్కీ ఇచ్చిన పిలుపుతో కదలివచ్చాడు వాలి. అందుకే తన భార్య, ఏడాది కూడా నిండని కుమారుడిని వదిలేసి, ఈ యుద్ధంలోకి అడుగుపెట్టాడు వాలి. వచ్చేవారం అతడి కుమారుడి మొదటి పుట్టిన రోజు జరగనుంది. కానీ ఈ సమయంలో యుక్రెయిన్‌ ప్రజలకు తన సహాయం అవసరమని వచ్చేశాడు వాలి. వచ్చీ రాగానే ఆరుగురు రష్యన్ సైనికులను చంపేశాడు వాలి. శత్రువు ఉన్న దూరం, గాలి వేగం.. అన్నింటిని పక్కాగా లెక్కకట్టి ట్రిగ్గర్ నొక్కుతాడు వాలి. అంతే, శత్రువు తల పుచ్చకాయలా పేలిపోవాల్సిందే. ఇదే ఇప్పుడు రష్యా సైనికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎటునుంచి ఏ తూటా దూసుకొస్తుందోనన్న భయంతో రష్యన్ సైనికులు వణికిపోతున్నారు.

ఇక బుధవారం యుక్రెయిన్ చేరుకున్న వాలి.. ఇప్పటికే ఆరుగురు రష్యన్‌ సైనికుల్ని హతమార్చాడని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ స్నైపర్‌గా పేరుపొందిన అతడు.. అత్యధికంగా రోజుకు 40 మందిని మట్టుపెట్టగల సత్తా ఉన్నవాడట. మాములుగా సగటు స్నైపర్‌ రోజుకు 5 నుంచి 6 లక్ష్యాలను చేధించగలడు. అదే ఉత్తమ పనితీరు ప్రదర్శించేవారు రోజుకు 7 నుంచి 10 వరకూ ఛేదిస్తారు.

సైనిక చర్య పేరుతో ఫిబ్రవరి 24న యుక్రెయిన్ పై దాడుల మొదలు పెట్టింది రష్యా. ఇప్పటికే రెండు వారాలు దాటిపోయాయి. ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇరువైపులా ప్రాణనష్టం సంభవిస్తోంది. నివాస భవనాలు, ఆసుపత్రులు అనే తేడా లేకుండా రష్యా అన్నింటిపైనా బాంబుల వర్షం కురిపిస్తోది. దీంతో యుక్రెయిన్‌ వాసులు ప్రాణాలు అరచేతపట్టుకొని.. పొరుగు దేశాలకు పరుగులు తీస్తున్నారు.