Traffic Signal for Camels : ఒంటెల కోసం ట్రాఫిక్ సిగ్నల్‌..ప్రపంచంలో ఫస్ట్ టైమ్

Traffic Signal for Camels : ఒంటెల కోసం  ట్రాఫిక్ సిగ్నల్‌..ప్రపంచంలో ఫస్ట్ టైమ్

Traffic Signal For Camels  In China (1)

Updated On : April 19, 2021 / 12:39 PM IST

Traffic Signal for Camels  In china : నగరాల్లోను..చిన్నపాటి టౌనుల్లోను ట్రాఫిక్ సిగ్నల్స్ చూశాం. ప్రజలకు ప్రమాదాలు జరగకుండా ఉంటానికి..ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి రోడ్లపై ఏర్పాటు చేస్తారనే విషయం తెలిసిందే. కానీ జనాల కోసం కాకుండా ఒంటెల కోసం ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయటం గురించి చూశారా? పోనీ చూశారా? అంటే లేదనే చెబుతాం. కానీ డెవలప్ మెంట్ లోను..టెక్నాలజీలోను దూసుకుపోతున్న చైనా ఒంటెల కోసం ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేసింది. ప్రపంచంలో తనదైన శైలిలో ప్రత్యేకతను చాటుకునే చైనా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒంటెల కోసం ట్రాఫిక్ సిగ్నల్‌ను ఏర్పాటు చేసింది.

153

 

దీనికి కారణం ఏమిటంటే..చైనాలోని డన్‌షువాంగ్ నగరంలోని మింగ్షా పర్వతం,క్రెసెంట్ స్ప్రింగ్‌లో ఒంటెల కోసం ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేసింది. చైనాలోని గన్సు ప్రావిన్స్ ప్రాంతం పర్యాటకులకు ప్రసిద్ది చెందింది. ఈ ప్రదేశాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడికొస్తుంటారు. ఇక్కడ ఒంటె స్వారీని ఎంజాయ్ చేస్తారు.

1

విండ్‌బ్లోన్ ఇసుక దిబ్బలతో చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటుంది ఈ ప్రదేశం. ఈ ప్రదేశం ప్రత్యేకత ఏమిటంటే..సాధారణంగా ఇసుక తిన్నెల్లో ప్రయాణిస్తుంటే..ఒక రకమైనా గాలి ఝమ్మంటూ వీచి ఇబ్బంది పెడుతుంటుంది. కానీ ఇక్కడ ఇసుక తిన్నెల్లో నడుస్తుంటే వీచే గాలి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దానికి కారణం ఇక్కడ గాలి వీస్తే..ఏదో డ్రమ్స్ వాయిస్తున్నట్లు..ఉరుములు ఉరిమినట్లుగా సౌండ్స్ వస్తుంది.

2

అందుకే దీన్ని ‘సింగింగ్ శాండ్స్ మౌంటెయిన్’‌ అని పిలుస్తుంటారు. ప్రధానంగా ఎడారి ప్రాంతంలో సూర్యాస్తమయాన్ని ఆస్వాదించడాన్ని సందర్శకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ క్యామెల్ రైడ్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఒంటెపై స్వారీ చేసే సయమంలో మిగతా ఒంటెల్ని గుద్దుకుని ఇబ్బంది పడకుండా ఉండటానికి.. యాక్సిడెంట్ కాకుండా ఉండటానికి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. ఒంటెలు రహదారిని దాటడానికి గ్రీన్ సిగ్నల్, వాటిని ఆపడానికి ఎరుపు రంగు సిగ్నల్స్ అమర్చారు.