World Biggest Gold Mine
Worlds Largest Gold Mine In Nevada : బంగారం భారతీయులకు ఎంతో ఇష్టమైనది.మగువులకు బంగారం అంటే ఎంతో ఇష్టం అని చెబుతారు.కానీ ఆడవారు బంగారం కొనుక్కునేది మెడలో వేసుకుని తిరగటానికి కాదు.బంగారం అంటే ఓభరోసా. ఇంటి యజమానికి అర్జంట్ గా డబ్బులు అవసరమైతే మెడలో పుస్తెల తాడుతో పాటు మంగళసూత్రాల్ని కూడా తీసి ఇచ్చేస్తుంది ఇంటి ఇల్లాలు. వ్యవసాయానికైనా. వ్యాపారానికైనా..హాస్పిటల్ ఖర్చులకైనా ఇలా కష్టంలో ఆదుకునేది ఇంటిలో ఉండే చిన్నా చితకా బంగారం వస్తువులే. కొంతమంది పెట్టుబడిగా కూడా బంగారాన్ని కొంటుంటారు. ఇలా డబ్బులు,బంగారం లింక్ గా నడిచే ఈ ప్రక్రియ కొనసాగుతుంటుంది. అదంతా పక్కన పెడితే ఈ బంగారం ఎక్కడ నుంచి వస్తుంది? అంటే గనుల్లోంచే అనే విషయంత తెలిసిందే. మరి ప్రపంచంలోనే అత్యంత పెద్ద బంగారు గని ఎక్కడుందో తెలుసా? ఆ బంగారు గనినుంచి ప్రపంచ వ్యాప్తంగా బంగారం ఎగుమతి అవుతుందనే విషయం తెలుసా?మరి ఇంత పెద్ద గనిలో ఎంత బంగారం ఉత్పత్తి అవుతుందో తెలుసా? మరి ఇటువంటి విషయాలన్ని తెలుసుకోవాలంటే ఇదిగో ఇది చదవాల్సిందే…
అది అమెరికాలోని నెవాడా సిటీల. ఈ నెవాడలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద బంగారు గని ఉంది. ఈ గని నుంచే బంగారం ప్రపంచదేశాలకు ఎగుమతి అవుతుంది. ఈ నెవాడ గనినుంచి ప్రతీ ఏటా లక్షల కిలోల బంగారాన్ని ఉత్పత్తి అవతుంది. దాన్ని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గనుల నుంచి బంగారం లభ్యమవుతున్నా.. అత్యధిక బంగారాన్ని మాత్రం నెవాడా బంగారం గని నుంచే లభ్యమవుతుంది అంటే అది ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు. ఈ బంగారం గని సంవత్సరానికి లక్షల కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచంలోని అన్ని దేశాలకు ఇక్కడి నుంచి బంగారం ఎగుమతి అవుతుంది. అంటే ఈ బంగారం గని ద్వారా ఏటా ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుందో ఊహించాలంటే కూడా సాధ్యంకాదు. బహుశా సంఖ్య కూడా సరిపోదేమో..!
నెవాడా నుంచి బంగారం తవ్వకాలు..
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ఆధారంగా ‘స్టాటిస్టా’ రూపొందించిన జాబితా ప్రకారం నెవాడా బంగారం గని నుంచి ప్రతీ సంవత్సరం లక్షా 70 వేల కిలోల వరకు బంగారం తవ్వి తీయబడుతోంది. ఇక్కడనుంచి దాదాపుగా 600 కోట్ల రూపాయల విలువైన బంగారం ఎగుమతి అవుతుందట. వింటనే కళ్లు తిరిగిపోతున్నాయి కదూ. అదే మని నెవాడా ప్రత్యేకత.
Read more : Gold-Mines: ఆంధ్రప్రదేశ్‌లో బంగారు గనులు.. తవ్వకాలకు అనుమతులు
1835 నుండి 2017 వరకు నెవాడా నుంచి 20,59,31,000 ట్రాయ్ ఔన్సుల బంగారాన్ని ఉత్పత్తి చేసిందట. పసుపు రంగులో మెరిసిపోతు కళ్లు మిరిమిట్లు గొలిపే బంగారం చూడటానికే కాదు…దాని గురించి తెలుసుకుంటే కూడా రోమాలు నిక్కబొడుకుంటున్నాయి కదూ. కేజీఎఫ్ సినిమాలో బంగారాన్ని వెలికి తీయటానికి మనుషుల్ని బానిసల్లా ఎలా ఉపయోగించుకుంటున్నారో..వారి జీవితాలు ఆ గనుల్లోనే ఎలా సమాధి అయిపోతున్నాయో చూపించిన విధానం షాక్ కు గురిచేస్తుంది.
Read more : యూపీలో రూ.12లక్షల కోట్ల బంగారపు గనులు
ఏది ఏమైనా బంగారం అంటే బంగారమే. దానికి మించిన ఎన్ని లోహాలున్నా బంగారానికి ఉండే విలువ ఎప్పటికీ దగ్గదు. అందుకే ‘బంగారం’ లాంటి అని పోలుస్తాం. సామాన్యుల నుంచి శ్రీమంతుల వరకు బంగారం కొనటానికి ఆసక్తి చూపిస్తుంటారు. భలే బాగున్నాయి కదూ ఈ బంగారం విశేషాలు..!! అంతేమరి బంగారం అంటే బంగారమే..!!!
Read more : Water gold : నీటిని బంగారంగా మార్చిన సైంటిస్టులు