యూపీలో రూ.12లక్షల కోట్ల బంగారపు గనులు

యూపీలో రూ.12లక్షల కోట్ల బంగారపు గనులు

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) బంగారపు గనులను కనుగొంది. ఉత్తరప్రదేశ్‌లోని సొంభద్ర జిల్లాలో 3వేల టన్నుల బరువున్న రూ.12లక్షల కోట్ల విలువైన గనులు బయటపడ్డాయి. ఇది దాదాపు భారత దేశ సంపదకు దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. సోన్ పహాడీ, హర్ది ప్రాంతాల్లో బంగారం నిల్వలు కనుగొన్నారు. 1992-93 కాలం నుంచే ఇక్కడ పరిశోధనలు జరపడం మొదలుపెట్టారు 

ఇక్కడ తవ్వకాలు జరిపేందుకు త్వరలోనే ఈ-టెండర్లు వేయనున్నారు. బంగారం నిల్వలతో పోలిస్తే ప్రపంచంలోనే రెండో స్థానంలో అమెరికా తర్వాత స్థానాన్ని భారత్ సొంతం చేసుకోనుంది. అమెరికాలో 8వేల 133టన్నుల నిల్వలు ఉండగా, జర్మనీలో 3వేల 366టన్నులు, ఇటలీలో 2వేల 451టన్నులు, ఫ్రాన్స్‌లో 2వేల 436టన్నులు ఉన్నాయి. 

ఈ ప్రాంతంలో బంగారంతో పాటు మరి కొన్ని మినరల్స్ ఉన్నట్లు గుర్తించారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం.. గతంలో భారత్‌ వద్ద 626 టన్నుల బంగారపు నిల్వలు ఉన్నాయి. కొత్తగా బయటపడ్డ గనుల తర్వాత అది ఐదు రెట్లు పెరిగే అవకాశం ఉంది. బ్రిటిష్ కాలంలోనే ఇక్కడ బంగారం నిల్వల కోసం తవ్వకాలు మొదలుపెట్టారు. 

అక్కడ నక్సల్స్ ఉండే ప్రాంతం కావడంతో అంతగా సాధ్యపడలేదు. ఉత్తరప్రదేశ్‌లో రెండో అతిపెద్ద జిల్లా అయిన సోన్‌భద్ర ప్రత్యేకమైనది. నాలుగు రాష్ట్రాల సరిహద్దు ఉన్న జిల్లా. పడమరన మధ్యప్రదేశ్, దక్షిణాన చత్తీస్‌ఘడ్, తూర్పున బీహార్, ఆగ్నేయంలో జార్ఖండ్ ఉన్నాయి. 

Read More>>వాహ్..సాలీడు సోలో టాలెంట్!!.. ఇంజనీర్ కూడా సరిపోడు..