ఒంగోలు ఆవా మజాకా?.. వరల్డ్ రికార్డు రేట్.. దీన్ని కొన్న రేటుకి హైదరాబాద్ లో ఎన్ని విల్లాలు కొనొచ్చో..!
వాటి శరీర సౌష్ఠవం భారీగా ఉంటుంది. అంతేకాదు...

వ్యవసాయంలో ఆవులు కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని ఆవులు వాటి విశిష్ట లక్షణాల కారణంగా భారీ ధర పలుకుతాయి. ఇటువంటి ఒక ఆవు వేలంలో ఏకంగా రూ.41 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. తాజాగా బ్రెజిల్‌లో ఆవుల వేలం జరిగింది.
ఒంగోలు జాతికి చెందిన వియాటినా-19 అనే ఆవును ఓ వ్యక్తి అంతటి భారీ ధరకు కొనుకున్నారు. ఇంతకు ముందు వరకు అత్యంత ఖరీదైన జాతులుగా జపాన్ వాగ్యు, భారత్ బ్రాహ్మణ్ ఉండేవి. ఇప్పుడు బ్రెజిల్‌లోని మినాస్ గెరెయిస్‌లోని ఆవు పాత రికార్డులు అన్నింటినీ బద్దలు కొట్టింది.
AI tools: కేంద్రం సంచలనం.. ఈ జాబ్స్ చేసేవాళ్లు చాట్ జీపీటీ, డీప్‌సీక్ వాడొద్దని ఆర్డర్స్
ఒంగోలు జాతి ఆవులు ఎంతో విశిష్టమైనవి. వాటి శరీర సౌష్ఠవం భారీగా ఉంటుంది. వాటి జాతి లక్షణం ఈ ఆవును ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. ఈ ఆవు శరీరం అంతా వైట్ కలర్‌లో తళతళలాడుతూ ఉంటుంది. ఆ ఆవు పై చర్మం వదులుగా ఉంటుంది.
దీంతో భారీ ఉష్ణోగ్రతలను తట్టుకుంటాయి. మూపురంతో పాటు కండరాల నిర్మాణం కూడా ఈ ఆవుకు ప్రత్యేకంగా ఉంటాయి. ఇంతటి అసాధారణ జన్యు నిర్మాణం ఉన్న ఈ ఆవులు పాడి పశువుల ఉత్పత్తికి గేమ్ చేంజర్‌గా మారతాయని నిపుణులు అంటున్నారు.
ఈ వియాటినా-19 ఒంగోలు జాతి ఆవు కన్నా రెండింతల పరిమాణంలో ఉంది. దీని బరువు 1,101 కిలోలు. రూ.41 కోట్లు పలికి ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఆవుగా నిలిచింది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులోకి ఎక్కింది. చాంపియన్ ఆఫ్ ది వరల్డ్ పోటీలో ఈ ఆవు మిస్ సౌత్ అమెరికా కిరీటాన్ని కొట్టేసింది.