బైటపడ్డ 8 వేల ఏళ్లనాటి సహజ ముత్యం

  • Published By: veegamteam ,Published On : October 21, 2019 / 05:03 AM IST
బైటపడ్డ 8 వేల ఏళ్లనాటి సహజ ముత్యం

Updated On : October 21, 2019 / 5:03 AM IST

ముత్యం అంటే చూడ ముచ్చటగా ఉంటుంది. అదీ సహజసిద్ధమైన ముత్యం అయితే.. ఇంకెంత అద్భతంగా ఉంటుందో కదా..అటువంటి అత్యంత పురాతన అరుదైన ముత్యం బైటపడింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతమైనదిగా గుర్తించారు నిపుణులు. ఈ అరుదైన..అద్భుతమైన ముత్యం..కాదు కాదు ఆణి ముత్యం సుమారు 8000 ఏళ్లనాటి నియోలిథిక్‌ యుగానికి చెందినదని పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఆణి ముత్యం యూనైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) రాజధాని అబూ ధాబీకి సమీపంలోని మార్వా ద్వీపంలో జరిపిన తవ్వకాల్లో పురావస్తు శాస్త్రవేత్తలు వెలికితీశారు.

ఈ ముత్యం లభ్యమైన భూమి పొరలను కార్బన్‌ డేటెడ్‌ పరిజ్ఞానం ద్వారా పరిశీలించగా క్రీస్తూ పూర్వం 5800-5600 నాటి నియోలిథిక్‌ కాలానికి చెందినదిగా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని అబూ ధాబీ సాంస్కృతిక, పర్యాటకశాఖ తెలిపింది. దేశ ఆర్థిక, సాంస్కృతిక చరిత్రకు నిదర్శనంగా కనిపిస్తోందనీ..పురావస్తు శాఖ చైర్మన్‌ మహ్మద్‌ అల్‌-ముబారక్‌ అన్నారు. 

తవ్వకాల్లో ఈ పురాతన ముత్యంతో పాటు సిరామిక్స్‌, రాతి, షెల్‌ పూసలు, రాతికొన కలిగిన బాణాలు..విల్లులు లభించాయని తెలిపారు. అక్టోబర్ 30న అబూ ధాబీలోని లూవ్రేలో జరుగనున్న పారీస్‌కు చెందిన మ్యూజియంలో ఈ సహజ ముత్యాన్ని ప్రదర్శించనునన్నామని తెలిపారు. ఈ ముత్యంతోపాటు తవ్వకాల్లో లభించిన ఇతర వస్తువులను కూడా ప్రదర్శించనున్నామన్నారు. 

మార్వా ద్వీపం తీరాల్లో సహజంగా లభించే ముత్యాలకు బదులుగా సిరామిక్స్‌, ఇతర వస్తువులను మార్పిడి చేసుకునేవారని విశ్లేషకులు భావిస్తున్నారు. 16వ శతాబ్దంలో యూఏఈ ముత్యాల వ్యాపారంలో ఆర్థిక శక్తిగా ఉండేదనీ…1930లో జపాన్‌ కల్చర్‌ ముత్యాల రాకతో ఆ వ్యాపారం కుప్పకూలిందని విశ్లేషకులకు తెలిపారు. ఆ తరువాత గల్ఫ్‌ దేశాలు చమురు పరిశ్రమలపై దృష్టిసారించి ఆర్థికంగా రాణించాయని వారు అన్నారు.