NRI Husband: ఖర్చు ఎక్కువైందని భార్యను వదిలేసిన ఎన్‌ఆర్ఐ భర్త.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన

భార్య చదువుకు అయ్యే ఖర్చు ఎక్కువైందని ఏకంగా భార్యనే వదిలేశాడు ఓ ఎన్నారై భర్త. యువతి తల్లిదండ్రులు ఎన్నిసార్లు నచ్చచెప్పినా అల్లుడు వినకపోవటంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

NRI Husband: ఖర్చు ఎక్కువైందని భార్యను వదిలేసిన ఎన్‌ఆర్ఐ భర్త.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన

NRI Marrige

Updated On : February 23, 2023 / 10:56 AM IST

NRI Husband: విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్న వారికి పిల్లనిచ్చేందుకు ఎక్కువ మంది ఆడ పిల్లల తల్లిదండ్రులు ఆసక్తి చూపుతుంటారు. ఎక్కువ జీతం రావటంతో పాటు లగ్జరీ లైఫ్ ఉంటుందని, బిడ్డ సంతోషంగా ఉంటుందనే భావనతో ఆడ పిల్లలను ఎన్ఆర్ఐలకు ఇచ్చి పెళ్లి చేస్తుంటారు. ఇలా పెళ్లిళ్లు చేసుకున్నవారిలో ఎక్కువశాతం కాపురాలు సజావుగానే ఉన్నప్పటికీ కొందరు ఎన్ఆర్ఐ భర్తలు వింత ప్రవర్తనలతో కాపురాలు కూలిపోవటంతోపాటు ఆడ పిల్లల తల్లిదండ్రులకు శోకాన్ని మిగుల్చుతున్నారు. ఇలాంటి తరహా కేసు తాజా వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్య చదువుకు ఖర్చులను భరించలేనని ఎన్ఆర్ఐ భర్త ఆమెను వదిలేశాడు. అమ్మాయితల్లిదండ్రులు ఎన్నిసార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవటంతో గచ్చిబౌలి మహిళా పోలీసులను ఆశ్రయించారు.

NRIs in US: అమెరికాలోని NRIలకు ఉపాధి కష్టాలు.. ఉద్యోగాలు కోల్పోతున్న వేలాది మంది

హైదరాబాద్ లోని మాదాపూర్ కు చెందిన ఓ యువతి స్థానికంగా డిగ్రీ పూర్తి చేసింది. ఆమె తల్లిదండ్రులు మ్యారేజ్ బ్యూరోల ద్వారా అమెరికాలో స్థిరపడిన వ్యక్తికి ఇచ్చి పెళ్లిచేశారు. యూఎస్‌లోని వర్జీనియాలో ఉద్యోగికావటంతో పెళ్లి అయిన కొద్దిరోజులకు తన భార్యను తీసుకొని వెళ్లిపోయాడు. వీరి కాపురం ఐదేళ్లపాటు సజావుగా సాగింది.అయితే, ఆర్థికంగా భర్తకు చేదోడుగా ఉండేందుకు యువతి నిర్ణయించుకొని తన చదువును కొనసాగించేందుకు సిద్ధమైంది. దీంతో అక్కడే ఓ యూనివర్శిటీలో ఎంఎస్‌లో చేరింది.

NRI UPI Payments : ఇకపై ఈ దేశాల్లోని NRIలు కూడా ఇంటర్నేషనల్ మొబైల్ నెంబర్లతో UPI పేమెంట్స్ చేసుకోవచ్చు.. ఇదిగో ఫుల్ లిస్టు మీకోసం..!

అయితే, కొన్నాళ్ల తరువాత భార్య చదువుకు ఖర్చు ఎక్కువ అవుతుందని ఎన్ఆర్ఐ భర్త ఆమెను వదిలించేందుకు సిద్ధమయ్యాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవులు జరుగుతూ వచ్చాయి. ఈ విషయాన్ని యువతి ఇండియాలోని తల్లిదండ్రులకు తెలిపింది. పలుసార్లు యువతి తల్లిదండ్రులు అల్లుడితో మాట్లాడినా ఫలితం కనిపించలేదు. ఇండియాలో అల్లుడి తల్లిదండ్రులను సంప్రదించినప్పటికీ ఫలితం లేకపోవటంతో యువతి తల్లిదండ్రులు గచ్చిబౌలి మహిళా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విదేశాల్లో తన కూతురు ఒంటరైపోయిందని యువతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.