అమెరికాను వణికిస్తున్న ‘జొంబీ డీర్ ’వ్యాధి

  • Published By: veegamteam ,Published On : February 15, 2019 / 05:45 AM IST
అమెరికాను వణికిస్తున్న ‘జొంబీ డీర్ ’వ్యాధి

Updated On : February 15, 2019 / 5:45 AM IST

అగ్రరాజ్యం అమెరికాను ఒక భయంకరమైన కొత్త వ్యాధి వణికిస్తోంది. ఈ వ్యాధి పేరు జొంబీ డీర్. ఇప్పటికే జంతువుల నుంచి వ్యాప్తి చెందే అనేక అంటురోగాలతో అవస్థలు పడుతున్న అమెరికా ఇపుడు జింకలను చూస్తేనే భయపడిపోతోంది. వన్య ప్రాణులైన జింకలు, దుప్పులలో ఈ వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తోంది. ఈ వ్యాధి మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో, అమెరికా ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది.

ఈ వ్యాధికి సంబంధించిన వైరస్ సోకగానే దాని లక్షణాలు వెంటనే బహిర్గతం కావు. శరీరం మొత్తంలో విస్తరించిన తర్వాత గానీ వ్యాధి సోకినట్టు అర్థం కాదు. ఇదే ఇప్పుడు అంత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం. అమెరికాలోని  అమెరికాలోని ఇలినాయిస్ సహా 24 రాష్ట్రాలతో పాటు… రెండు కెనెడియన్ ప్రావిన్స్ లలో కూడా ఈ వ్యాధి వ్యాపించినట్టు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్  అండ్‌ ప్రివెన్షన్‌ అధికారులు తెలిపారు.

జొంబీ వైరస్ సోకగానే బరువు తగ్గిపోవడం, బాగా దప్పిక వేయడం, నోటి నుంచి చొంగ కారడం వంటి సంకేతాలు కనిపిస్తాయట. ఇప్పటికే వేలకొద్దీ జింకల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. అలాగే  వీటి శారీరక ద్రవాలు మలం, లాలాజలం, రక్తం లేదా మూత్రంలో ఉన్న సీడబ్యూడీ వైరస్‌ ఎక్కువకాలం పర్యావరణంలో ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. మరోవైపు ఈ వ్యాధి నివారణకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో మరింత ఆందోళనకు  దారితీస్తోంది.