Devdutt Padikkal: పడిక్కల్ మ్యాచ్ ముగిద్దామంటే.. ముందు సెంచరీ పూర్తి చేయమన్నా – కోహ్లీ

సెంచరీ గురించి మాట్లాడుకున్నాం. అతనేమో మ్యాచ్ ముగించేద్దామన్నాడు. నేను ముందు సెంచరీ ...

Devdutt Padikkal: పడిక్కల్ మ్యాచ్ ముగిద్దామంటే.. ముందు సెంచరీ పూర్తి చేయమన్నా – కోహ్లీ

Devdutt Padikkal

Updated On : April 23, 2021 / 12:50 PM IST

Devdutt Padikkal: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. విధ్వంసమే సృష్టించింది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని చేధిస్తూ 10వికెట్ల తేడాతో గెలుపొందింది. సీజన్ లో తొలిసారి చెన్నై స్టేడియం బయట ఆడిన బెంగళూరు వాంఖడేలో గురువారం విజయాన్ని నమోదు చేసింది. ఓపెనర్ గా దిగిన పడిక్కల్ సెంచరీ చేయడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

ఇది అద్భుతమైన ఇన్నింగ్స్. అతను బ్యాటింగ్ బాగా చేశాడు. 30కి దాటి స్కోరు చేయడం లేదని అతనిపై చర్చ నడుస్తోంది. అవన్నీ పక్కకుపెట్టేశాడు. నిజంగా ఇలాంటి మైదానంలో రెచ్చిపోయి ఆడేశాడు. బౌలర్లే అతణ్ని చూసి భయపడిపోయారని మ్యాచ్ అనంతరం కోహ్లీ చెప్పుకొచ్చాడు.

టాస్ గెలిచిన అనంతరం ఆర్సీబీ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆర్సీబీ బ్యాట్స్ మన్ 177పరుగులు చేయగలిగారు. ఆర్సీబీ ఇన్నింగ్స్ లో 16.3ఓవర్లు ఆడి 181 పరుగులు పూర్తి చేశారు. కెప్టెన్ కోహ్లీ 47బంతుల్లో 72పరుగులు పూర్తి చేశాడు. అందులో 6ఫోర్లు, 3సిక్సులు ఉన్నాయి.

మరో ఎండ్ లో దిగిన పడిక్కల్ 52బంతుల్లో 11ఫోర్లు, 6సిక్సులు కలిపి 101 బాదేశాడు. సెంచరీతో పాటు పడిక్కల్ కీపింగ్ చేయడాన్ని కూడా బాగా ఎంజాయ్ చేశాడని కోహ్లీ ప్రశంసలు కురిపిస్తున్నాడు.

సెంచరీ గురించి మాట్లాడుకున్నాం. అతనేమో మ్యాచ్ ముగించేద్దామన్నాడు. నేను ముందు సెంచరీ పూర్తి చెయ్యమని చెప్పా. నువ్వు చెయ్యగలవని చెప్పా. అతను మూడు అంకెల స్కోర్ నమోదు చేయడానికి అర్హుడని ముందే తెలుసు.’ అని కోహ్లీ అంటున్నాడు.