IPL 2021 RR Vs KKR : నిప్పులు చెరిగిన క్రిస్ మోరిస్, కుప్పకూలిన కోల్ కతా, రాజస్తాన్ ముందు ఈజీ టార్గెట్
ipl-2021-rr-vs-kkr-rajasthan-royals-target-134-runs

Rr Vs Kkr
IPL 2021 RR Vs KKR : ఐపీఎల్ 2021 సీజన్ 14లో భాగంగా రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులు మాత్రమే చేసింది. ఇన్నింగ్స్ చివరి బంతికి శివమ్ మావి(5) బౌల్డ అవ్వడంతో కోల్‌కతా ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
రాజస్తాన్ బౌలర్లు కోల్ కతా బ్యాట్స్ మెన్ ను కట్టడి చేశారు. రాజస్తాన్ బౌలర్ క్రిస్ మోరిస్ నిప్పులు చెరిగాడు. నాలుగు వికెట్లు తీసి కోల్ కతా వెన్ను విరిచాడు. కోల్ కతా జట్టులో రాహుల్ త్రిపాఠి (36) హయ్యస్ట్ స్కోరర్. ఓపెనర్ నితీష్ రానా 22 పరుగులు, దినేష్ కార్తిక్ 25 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్ మెన్ విఫలం అయ్యారు.