AP WCD Jobs 2026 : AP నిరుద్యోగులకు అలర్ట్.. ఆ జిల్లాలో 171 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పరీక్ష లేదు.. పది పాసైతే చాలు.. జాబ్ పక్కా..
AP WCD Jobs 2026 : ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆ జిల్లాలో 171 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ap kadapa wcd recruitment 2026 notification for 171 anganwadi worker and helper posts details here
AP WCD Jobs 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 171 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి పాస్ అయితే చాలు.. రాత పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు అవకాశం ఉంది. ఇంతకూ ఈ ఉద్యోగాలు ఏమిటంటే.. అంగన్వాడీ పోస్టులు. ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ (ICDS), కడప జిల్లాలోని వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరింది.
మొత్తం పోస్టులు: 171
- అంగన్వాడీ కార్యకర్తల (AWW) పోస్టులు: 30
- అంగన్వాడీ హెల్పర్ (AWH) పోస్టులు: 141
- అర్హులైన మహిళా అభ్యర్థులు మాత్రమే వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు:
- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- అభ్యర్థులు సంబంధిత గ్రామం లేదా వార్డుకు చెందిన వివాహిత మహిళలై ఉండాలి.
- నివాస ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.
వయో పరిమితి:
- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళల వయస్సు జూలై 1, 2026 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో కనీస వయస్సును 18 ఏళ్లుగా పరిగణిస్తారు.
దరఖాస్తు విధానం:
పైన పేర్కొన్న అర్హతలు కలిగిన వారు ఆఫ్లైన్ విధానంలో ఏప్రిల్ 13, 2026 సాయంత్రం 5 గంటలలోపు నోటిఫికేషన్లో ఇచ్చిన చిరునామాలో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం:
ఎంపిక ప్రక్రియ మొత్తం 100 మార్కులకు ఉంటుంది. అయితే ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు.
మార్కుల కేటాయింపు (వెయిటేజీ):
- 10వ తరగతి మార్కులకు: 50 మార్కులు
- ప్రీ-స్కూల్ శిక్షణ తీసుకున్న వారికి: 5 మార్కులు
- వితంతువులకు: 5 నుంచి 10 మార్కులు
- అనాథలకు: 10 మార్కులు
- వికలాంగులకు: 5 మార్కులు
- ఇంటర్వ్యూకు: 20 మార్కులు
ఇంటర్వ్యూ:
ఇంటర్వ్యూను ఏప్రిల్ 23, 2026వ తేదీన సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO) కార్యాలయంలో నిర్వహిస్తారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించి తెలుసుకోవచ్చు.
