AP Forest Jobs 2026 : నిరుద్యోగులకు శుభవార్త.. అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఈ పత్రాలు ఉంటే చాలు
AP Forest Jobs 2026 : ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అటవీశాఖలో ఉద్యోగాల భర్తీకి రెడీ అయ్యింది.
AP Forest Department Recruitment 2026 Notification released to Recruitment 40 posts under sports quota
AP Forest Jobs 2026 : నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అందరూ అర్హులు కారు. కేవలం క్రీడాకారులకు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే ఈ ఉద్యోగాల భర్తీ కోసం అభ్యర్థులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో స్పోర్ట్స్ కింద ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూసేవారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 40 పోస్టులను క్రీడా కోటా కింద భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టుల నియామకాన్ని.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులకు ఇది మంచి అవకాశం అంటున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి పలు కీలకాంశాల గురించి ఇక్కడ ఇస్తున్నాం.
అటవీ శాఖలో మొత్తం 40 పోస్టులను భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు సమయం
ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు మే 18 నుంచి జూన్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కావాల్సిన డాక్యుమెంట్లు
అభ్యర్థులు తమ క్రీడా ప్రతిభకు సంబంధించిన ధ్రువపత్రాలు, అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ
ఆసక్తి గల అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను ప్రత్యేక కమిటీ పరిశీలన చేసి అర్హులను ఎంపిక చేయనుంది.
ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని క్రీడాకారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. క్రీడల్లో రాణించిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా మరింత ప్రోత్సాహం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు.
