8వ తరగతి పాసైతే చాలు : BECILలో మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలు 

  • Publish Date - June 1, 2020 / 08:02 AM IST

నోయిడాలోని భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన బ్రాడ్ క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL)లో మల్టీ టాస్కింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (EDMC)లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 464 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్దులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విద్యార్హత : అభ్యర్దులు 8వ తరగతి పాసై ఉండాలి. సంబంధింత విభాగంలో 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక విధానం : అభ్యర్దులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. 
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ అభ్యర్దులు రూ.500 చెల్లించాలి. SC,ST,PWD అభ్యర్దులు రూ.250 చెల్లించాలి.

ముఖ్య తేదీలు : 
దరఖాస్తు ప్రారంభ తేదీ : మే 28, 2020.
దరఖాస్తు చివరి తేదీ : జూన్ 15, 2020.

దరఖాస్తు పంపాల్సిన చిరునామా :
General Manager (HR) in BECIL’s Head Office at BECIL,
14-B, Ring Road, I.P. Estate,
New Delhi-110002, 
Phone: 011-23378823.

Read: తెలంగాణ గురుకులాల్లో లెక్చరర్ ఉద్యోగాలు

ట్రెండింగ్ వార్తలు