SSB Constable Recruitment 2026 : పదో తరగతి పాస్ అయితే చాలు.. కానిస్టేబుల్ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే.. నెలకు రూ.69 వేల జీతం..!
SSB Constable Recruitment 2026 : పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కోసం చూసే వారికి పండగలాంటి వార్త. రాత పరీక్ష లేకుండా కానిస్టేబుల్ జాబ్ పొందే అవకాశం.
- Dharani Pilli
- Updated on- May 10, 2026 / 05:26 PM IST
Sashastra Seema Bal ssb Constable GD Sports Quota Recruitment 2026 Notification released for 404 posts details here
SSB Constable Recruitment 2026 : మీరు పదో తరగతి పాస్ అయ్యారా.. ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా.. అది కూడా ఎలాంటి రాత పరీక్ష లేకుండా.. అయితే ఈ వార్త మీకోసమే. కేంద్ర ప్రభుత్వం పదో తరగతి అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్ (SSB), 2026 సంవత్సరానికి గానూ స్పోర్ట్స్ కోటా కింద కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-సి విభాగంలోని ఈ ఉద్యోగాలకు అర్హులైన మహిళా, పురుష క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు
పోస్టు పేరు: కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) – గ్రూప్ సి (నాన్ గెజిటెడ్).
మొత్తం ఖాళీలు:
404 పోస్టులు.
విధి నిర్వహణ:
ఈ పోస్టులకు ఎంపికైన వారు భారతదేశంలో ఎక్కడైనా, అలానే విదేశాల్లోనైనా సరే పని చేయాల్సి ఉంటుంది.
అర్హతలు
విద్యార్హత: ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
క్రీడా అర్హత:
- అభ్యర్థులు కింది క్రీడల్లో అంతర్జాతీయ లేదా జాతీయ స్థాయిలో దేశం/రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించి ఉండాలి.
- అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, వాలీబాల్, రెజ్లింగ్, షూటింగ్, జూడో, యోగాసన తదితరాలు.
- సీనియర్/జూనియర్ జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధించిన వారు లేదా ఖేలో ఇండియా గేమ్స్ మెడలిస్టులు కూడా అర్హులే.
వయోపరిమితి:
- 18 నుండి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
జీత భత్యాలు
- పే స్కేల్: నెలకు రూ. 21,700 నుండి రూ. 69,100 వరకు ఉంటుంది.
- దీనితో పాటు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్స్‌లు లభిస్తాయి.
దరఖాస్తు ప్రక్రియ
ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చివరి తేదీ:
ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 7, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలి..
దరఖాస్తు ఫీజు:
- జనరల్, EWS, OBC అభ్యర్థులకు: రూ. 100.
- SC, ST మరియు మహిళా అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం
ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులను వారి క్రీడా ప్రతిభ (Sports Achievement) మరియు ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాల కోసం SSB అధికారిక వెబ్ సైట్ ని సందర్శించండి.
