Prasar Bharati Hyd jobs 2026 : హైదరాబాద్‌లోనే రూ.4,20,000 జీతంతో ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే జాబ్ మీకే..
Prasar Bharati Hyd jobs 2026 : హైదరాబాద్ లోనే మంచి జీతంతో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే ఇది మీకోసమే.
Prasar Bharati Hyderabad Recruitment 2026 for various posts on contract base
Prasar Bharati Hyd jobs 2026 :హైదరాబాద్‌లోనే మంచి జీతంతో ఉద్యోగం కోసం చూసేవారికి నిజంగా ఇది పండగలాంటి వార్తే. కారణం నగరంలోనే.. ఏడాదికి రూ.4,20,000 వరకు ఆదాయం లభించే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇంతకూ ఈ నోటిఫికేషన్ దేనికి సంబంధించింది అంటే.. కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్ ఆధ్వర్యంలోని ప్రసార్ భారతి దూరదర్శన్ కేంద్రం. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రసార్ భారతి.. హైదరాబాద్ బ్రాంచ్‌లో ఒప్పంద ప్రాతిపదికన పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. ఈ క్రమంలో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రసార్ భారతి.. హైదరాబాద్ విభాగంలో ఖాళీగా ఉన్న వీడియో అసిస్టెంట్, రిసోర్స్ పర్సన్, పోస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులపై ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా (టీవీ ప్రొడక్షన్లో డిప్లొమా లేదా మాస్ కమ్యూనికేషన్ లేదా జర్నలిజం లేదా వీడియో ఎడిటింగ్ లేదా వీడియోగ్రఫీ)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే పలు ఉద్యోగాలకు.. నోటిఫికేషన్లో సూచించిన విధంగా ఉద్యోగానుభవం కూడా ఉండాలి.
వయసు:
అభ్యర్థుల వయోపరిమితి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు స్కిల్ టెస్ట్/ రాత పరీక్ష/ పర్సనాలిటీ టెస్ట్ వంటివి నిర్వహించి వాటిలో వచ్చిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం :
-
ఎంపికైన అభ్యర్థులకు ఒక్కో అసైన్‌మెంట్‌కు రూ.3,000 నుండి రూ.5,000 వరకు చెల్లిస్తారు.
-
ఏడాదికి గరిష్టంగా 84 అసైన్మెంట్లు ఉంటాయి.
-
నెలలో గరిష్టంగా 7 అసైన్మెంట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది.
దరఖాస్తు విధానం:
అర్హత కలిగిన వారు publicrelationsddyadagiri@gmail.com కు ఈమెయిల్ ద్వారా తమ దరఖాస్తు వివరాలు పంపించవచ్చు. లేదంటే కింది అడ్రస్‌కు నేరుగా వెళ్ళి అందజేయవచ్చు లేదా పోస్టు ద్వారా కూడా పంపించవచ్చు.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
- Head of Programmes,
- Doordarshan Kendra,
- Ramanthapur,
- Hyderabad – 500013.
దరఖాస్తుకు చివరి తేదీ:
దరఖాస్తులను తప్పనిసరిగా మే 29, 2026వ తేదీలోపు పంపించాల్సి ఉంటుంది.
