Mega Job Mela 2026 : నిరుద్యోగులకు శుభవార్త.. ఒకేసారి 162 ప్రముఖ కంపెనీలతో మెగా జాబ్ మేళా.. ఎప్పుడు.. ఎక్కడంటే..!
Mega Job Mela 2026 : నిరుద్యోగ యువతకు శుభవార్త.. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 162 కంపెనీలు పాల్గొనబోతున్నాయి.
mega job mela on 11th may with 162 companies at saroornagar in hyderabad
Mega Job Mela 2026 : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో రాష్ట్ర క్రీడలు, యువజన సేవల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక తెలంగాణ జాబ్ మేళా 2026’ నిర్వహించనున్నారు. ప్రైవేటు రంగంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా టాస్క్ (TASK), డీట్ (DEET) సంస్థల సహకారంతో ఈ భారీ మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నారు.
రంగారెడ్డిలో
ఈ మెగా జాబ్ మేళాలో భాగంగా.. రంగారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థుల కోసం.. మే 11, సోమవారం నాడు ఎల్బీ నగర్ సమీపంలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో మెగా జాబ్ మేళా నిర్వహించబోతున్నారు.
హైదరాబాద్ :
హైదరాబాద్ నిరుద్యోగ అభ్యర్థుల కోసం మే 12, మంగళవారం నాడు బంజారాహిల్స్‌లోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్లో జాబ్ మేళా నిర్వహించనున్నారు.
సమయం :
ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా ప్రారంభం అవుతుంది. ఈ రెండు రోజుల్లో నిర్వహించనున్న జాబ్ మేళాలో 160కి పైగా కంపెనీలు పాల్గొనబోతున్నాయి. బ్యాంకింగ్, ఫార్మా, ఐటీ, రిటైల్, ఇతర సర్వీస్ రంగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అర్హులు :
ఈ జాబ్ మేళా ద్వారా పది నుంచి బీటెక్, పీజీ పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు కల్పించనున్నారు.
ఈ పత్రాలు తప్పనిసరి
జాబ్ మేళాలో పాల్గొనడానికి వచ్చే అభ్యర్థులు కచ్చితంగా వీటిని తీసుకురావాలి.
- విద్యార్హత పత్రాల జిరాక్స్ కాపీలు,
- ఆధార్ కార్డ్,
- కనీసం 5-10 రెజ్యూమే
ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవాలి
అన్నింటికన్నా ముఖ్యంగా అభ్యర్థులు ముందుగా డీట్ (DEET) మొబైల్ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా రిజిస్టర్ చేసుకున్న వారికి ఎంపిక ప్రక్రియలో ప్రాధాన్యత లభించే అవకాశం ఉంటుంది.
ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హత గల వారికి అక్కడికక్కడే ఆఫర్ లెటర్లు అందజేస్తారని అధికారులు వెల్లడించారు. ఎంపికైన వారికి కంపెనీ నిబంధనల మేరకు ఆకర్షణీయమైన జీతంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి.
