Stree Nidhi Recruitment 2026 : నిరుద్యోగులకు బంపరాఫర్.. సొంత జిల్లాలోనే జాబ్… నెలకు రూ.34 వేల జీతం.. అస్సలు మిస్ చేసుకోవద్దు..!
Stree Nidhi Recruitment 2026 : నిరుద్యోగులకు శుభవార్త.. సొంత జిల్లాలోనే నెలకు రూ.34 వేల జీతం పొందే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది.
- Dharani Pilli
- Updated on- May 11, 2026 / 08:51 AM IST
Telangana Stree Nidhi Assistant Manager Recruitment 2026 Notification for 123 Posts full details here
Stree Nidhi Recruitment 2026 : తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర సర్కార్ పండగలాంటి వార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించి, సొంత జిల్లాలోనే పనిచేసే అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో పనిచేసే స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అసిస్టెంట్ మేనేజర్ (ఫీల్డ్ ఆపరేషన్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేషన్ ఫెడరేషన్ లిటిటెడ్ ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టనుంది. ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో పని చేస్తుంది.
మొత్తం పోస్టుల వివరాలు (కేటగిరీల వారీగా):
మొత్తం ఖాళీల సంఖ్య: 123
-
ఓసీ (OC): 60
-
ఈడబ్ల్యూఎస్ (EWS): 03
-
బీసీ-ఏ (BC-A): 16
-
బీసీ-బి (BC-B): 02
-
ఓహెచ్ (OH): 09
-
ఎస్సీ (SC – గ్రూప్ 1): 04
-
ఎస్సీ (SC – గ్రూప్ 2): 26
-
ఎస్టీ (ST): 03
అర్హతలు:
-
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 65% మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
-
స్థానికత: అభ్యర్థులు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి.
-
భాషా పరిజ్ఞానం: తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడటం, చదవడం మరియు రాయడం తెలిసి ఉండాలి.
-
సాంకేతికత: కంప్యూటర్‌లో ఎంఎస్ ఆఫీస్ (MS Office) పరిజ్ఞానం తప్పనిసరి.
-
ఇతరాలు: ఎంపికైన అభ్యర్థులు సొంతంగా బైక్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
-
అభ్యర్థుల వయస్సు 25 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
-
సడలింపు: బీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 5 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ముఖ్యమైన సమాచారం:
-
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే.
-
దరఖాస్తుకు చివరి తేదీ: మే 29, 2026 (రాత్రి 12 గంటల వరకు).
-
ఫీజు వివరాలు: * ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు: రూ. 770
-
ఇతర కేటగిరీల అభ్యర్థులకు: రూ. 885
-
ఎంపిక విధానం, వేతనం:
-
ఎంపిక: ఆన్‌లైన్ రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
-
జీతం: ఎంపికైన వారికి నెలకు సుమారు రూ. 33,960 వేతనంతో పాటు ప్రయాణ అలవెన్సులు (Travel Allowance) మరియు పనితీరు ఆధారిత వేరియబుల్ పే (Variable Pay) అందుతాయి.
