TSPSC Assistant Scientist Recruitment : తెలంగాణ నిరుద్యోగులకు పండగే.. డిగ్రీ పాస్ అయితే చాలు.. నెలకు రూ.1,24,150 జీతంతో ఉద్యోగం
TSPSC Assistant Scientist Recruitment : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
TSPSC release notification for 20 Assistant Scientist post Recruitment 2026 in pollution control board
TG Assistant Scientist Recruitment :
తెలంగాణ నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. డిగ్రీ పాస్ అయితే చాలు, భారీ వేతనంతో కూడిన ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు. దీనికి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TSPCB) లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-2) ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనుంది. డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 27, 2026వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
ముఖ్య వివరాలు:
అర్హత:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో (కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా) డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు:
- అభ్యర్థుల వయోపరిమితి జూలై 1, 2026 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తుకు ఆఖరి తేదీ:
అర్హత కలిగిన వారు ఆన్లైన్ విధానంలో మే 25, 2026 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి, అందులో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
జీతం:
ఎంపికైన వారికి నెలకు రూ. 45,960 నుండి రూ. 1,24,150 వరకు వేతనం చెల్లిస్తారు.
OTR తప్పనిసరి:
టీజీపీఎస్సీ (TGPSC) జారీ చేసే నోటిఫికేషన్లకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు కచ్చితంగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) అప్డేట్ చేసుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. చాలా మంది అభ్యర్థులు ఇంకా పూర్తిస్థాయిలో అప్డేట్ చేసుకోలేదని తెలుస్తోంది. భవిష్యత్తులో విడుదలయ్యే కొత్త ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలన్నా OTR అప్డేట్ తప్పనిసరి.
మరోవైపు, కాలుష్య నియంత్రణ మండలిలో త్వరలోనే మరో 6, 7 రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది.
