రేర్ ఫీట్ సాధించిన రౌడీ స్టార్..

రేర్ ఫీట్ సాధించిన రౌడీ స్టార్..

Updated On : December 24, 2020 / 4:20 PM IST

Vijay Deverakonda: సోషల్ మీడియా వినియోగం పెరిగేకొద్దీ సెలబ్రిటీలకు మిలియన్ల కొద్దీ ఫాలోయర్స్ పెరిగిపోతున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో సౌత్ స్టార్స్‌కి భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంటుంది.

తాజాగా టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌‌లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇన్‌స్టాలో విజయ్‌ని అక్షరాలా 10 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అంతేకాదు ఈ ఘనత సాధించిన మొట్టమొదటి సౌత్ ఇండియన్ యాక్టర్‌గా కూడా విజయ్ రేర్ ఫీట్ సాధించడం విశేషం. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండకు ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు.

విజయ్ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ఫైటర్’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమా కమిట్ అయ్యాడు.

Vijay Deverakonda