Aha : అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన ‘ఆహా’..

‘ఆహా’ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నవారి సంఖ్య ఏకంగా 10 మిలియన్లకు చేరుకుంది.. 100 దేశాలకు పైగా ‘ఆహా’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.. ఇంతటి లవ్, సపోర్ట్ అందిస్తున్న వారందరికీ ‘ఆహా’ టీం కృతజ్ఞతలు తెలియజేశారు..

Aha : అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన ‘ఆహా’..

100 Percent Telugu App Aha Crosses A Milestone Of 10 Million Downloads

Updated On : April 29, 2021 / 4:29 PM IST

Aha: 100% తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’.. బ్లాక్‌బ‌స్ట‌ర్ ఫిలింస్‌, ఒరిజినల్స్, వెబ్ షోల‌తో ఈ వేస‌విలో తెలుగు ప్రేక్ష‌కుల‌కు హౌస్ ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. వంద శాతం తెలుగు కంటెంట్ అందించే ఏకైక తొలి తెలుగు యాప్‌గా అతితక్కువ సమయంలోనే అందరిచేత ‘ఆహా’ అనిపించుకుంది..

Aha

ఇదిలా ఉంటే ‘ఆహా’ మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది.. ‘ఆహా’ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నవారి సంఖ్య ఏకంగా 10 మిలియన్లకు చేరుకుంది.. 100 దేశాలకు పైగా ‘ఆహా’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.. ఇంతటి లవ్, సపోర్ట్ అందిస్తున్న వారందరికీ ‘ఆహా’ టీం కృతజ్ఞతలు తెలియజేశారు..

Thank You Brother Aha

ఈ ఏడాదిలో ‘క్రాక్‌’, ‘గాలి సంప‌త్’, ‘నాంది’, ‘లెవ‌న్త్ అవ‌ర్‌’, ‘మెయిల్’, ‘తెల్ల‌వారితే గురువారం’, ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’ చిత్రాల త‌ర్వాత ‘సుల్తాన్’ సినిమాల తర్వాత ఎగ్జ‌ైటింగ్ థ్రిల్ల‌ర్ ‘థ్యాంక్ యు బ్ర‌ద‌ర్‌’ మూవీ మే 7న డైరెక్ట్‌గా‘ఆహా’ ద్వారా విడుదలవుతోంది..