సెలబ్రిటీ పనిమనిషి కూడా సెలబ్రిటీనే!..
పాపులర్ బాలీవుడ్ నటి అర్చన పురాన్ సింగ్ పనిమనిషి భాగ్యశ్రీ వీడియోలు వైరల్ అవుతున్నాయి..

పాపులర్ బాలీవుడ్ నటి అర్చన పురాన్ సింగ్ పనిమనిషి భాగ్యశ్రీ వీడియోలు వైరల్ అవుతున్నాయి..
లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్లకు పరిమితమైన సెలబ్రిటీలు సోషల్ మీడియాలో వీడియోలతో ఊపు ఊపుతున్నారు. వర్కౌట్స్, కుకింగ్, ఇంటి పనులు ఇలా ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సెలబ్రిటీల విషయం పక్కన పెడితే వారి పనిమనుషులేం తక్కువ కాదు అన్నట్టు బాలీవుడ్ నటి అర్చన పురాన్ సింగ్ ఇంటి పని మనిషి వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
లాక్‌డౌన్ నేపథ్యంలో సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్న అర్చన ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా గుడుపుతున్నారు. ఈ క్రమంలో తన ఇంటి పని మనిషి భాగ్యశ్రీ ఫన్నీ వీడియోలను తరచూ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. తాజాగా మరో వీడియోను అర్చన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. పని మనిషి భాగ్యశ్రీ పని చేస్తూ.. ఒక్కసారిగా పెద్దగా నవ్వడంతో.. ఎందుకు నవ్వావని అర్చన అడిగారు. వెంటనే భాగ్యశ్రీ టీవీలో వస్తున్న జోక్‌కి నవ్వాను అని చెప్పిన ఈ వీడియోను ‘Hazir jawaab! #bhagyashrirocks’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు.
Read Also : రాజమౌళి, మహేష్, దుర్గా ఆర్ట్స్ సినిమా ఫిక్స్.. క్లారిటీ ఇచ్చిన జక్కన్న
అలాగే నువ్వు ఎప్పుడూ నవ్వుతూ, ఆనందంగా ఉండడానికి కారణమేంటని అర్చన, భాగ్యశ్రీని అడగ్గా ‘మీ హ్యాపీ ఫ్యామిలీలో భాగమైనందు వల్లే ఇలా హ్యాపీగా ఉండగలుగుతున్నానని చెప్పింది. అలాగే భాగ్యశ్రీ డ్రెస్ గురించి అర్చనా అడగ్గా అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిందామె. అర్చన షేర్ చేసే వీడియోలతో భాగ్యశ్రీ సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయింది. ఈ వీడియోలకు లైక్స్, కామెంట్స్ కూడా బాగానే వస్తున్నాయి.