Aamir Khan : సోషల్ మీడియాకు గుడ్‌బై.. షాక్ అవుతున్న అభిమానులు..
బాలీవుడ్ స్టార్, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ సోషల్ మీడియాకు గుడ్‌బై చెప్పేసి ఫ్యాన్స్‌కి షాకిచ్చారు. ఆదివారం (మార్చి 14) ఆమిర్ తన 56వ పుట్టినరోజు జరుపుకున్నారు. కాగా బర్త్‌డే మర్నాడే ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో.. ఆయన అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.

Aamir Khan Social Media
Aamir Khan: బాలీవుడ్ స్టార్, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ సోషల్ మీడియాకు గుడ్‌బై చెప్పేసి ఫ్యాన్స్‌కి షాకిచ్చారు. ఆదివారం (మార్చి 14) ఆమిర్ తన 56వ పుట్టినరోజు జరుపుకున్నారు. కాగా బర్త్‌డే మర్నాడే ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో.. ఆయన అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఆమిర్ ఎందుకింతటి షాకింగ్ డెసిషన్ తీసుకున్నారంటే తన పనిపై పూర్తిగా శ్రద్ధ పెట్టేందుకే అని తెలుస్తోంది.
సోమవారం సాయంత్ర ఆమిర్.. ఇదే తన చివరి సోషల్ మీడియా పోస్ట్ అంటూ.. ‘‘నా అభిమానులకు థ్యాంక్స్. మీరంతా ఇంతకాలం నన్ను ఎంతగానో ఆదరించారు. మీ ప్రేమకు, సపోర్ట్‌కు థ్యాంక్స్. ఇదే నా చివరి సోషల్ మీడియా పోస్ట్. అయితే మీతో మాత్రం ఎప్పటిలానే ఇంటరాక్ట్ అవుతుంటాను. నాకు సంబంధించిన అప్‌డేట్స్‌ని మీరు ఏకెపిపిఎల్ (@akppl_official) అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పొందవచ్చు. ప్రేమతో మీ ఆమిర్ ఖాన్..’’ అంటూ ఓ పోస్ట్ చేశారు.
View this post on Instagram
తమ అభిమాన నటుడు సోషల్ మీడియా నుండి వైదొలగడం పట్ల ఫ్యాన్స్ చాలా నిరాశగా ఉన్నారు. కాగా అద్వైత్ చంద్రన్ దర్శకత్వంలో ఆమీర్, కరీనా కపూర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది.