Telugu Students : యుక్రెయిన్ నుంచి తిరిగివస్తున్న తెలుగు విద్యార్థులు .. ఢిల్లీకి చేరిన ఐదో విమానం..!
యుక్రెయిన్ యుద్ధ సంక్షోభం నేపథ్యంలో అక్కడి దేశంలో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్ర్రకియ కొనసాగుతోంది. యుక్రెయిన్ నుంచి వందలాది మంది భారతీయులు తిరిగి స్వదేశానికి చేరుకుంటున్నారు.

Air India 3rd Flight Carrying 250 Indians Included Telugu Students From Ukraine Reached Delhi Today
Russia Ukraine Crisis : యుక్రెయిన్ యుద్ధ సంక్షోభం నేపథ్యంలో అక్కడి దేశంలో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్ర్రకియ కొనసాగుతోంది. యుక్రెయిన్ నుంచి వందలాది మంది భారతీయులు తిరిగి స్వదేశానికి చేరుకుంటున్నారు. ఇప్పటివరకూ యుక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన రెండు విమానాల్లో మొత్తం 469 మంది స్వదేశానికి చేరుకున్నారు. అందులో తెలుగు విద్యార్థులను ఢిల్లీలోని ఏపీ భవన్, తెలంగాణ భవన్‌కు తరలించారు. యుక్రెయిన్ నుంచి సోమవారం (ఫిబ్రవరి 28) ఉదయం ఢిల్లీకి ఐదో విమానం చేరుకుంది. 249 మందితో రుమేనియా నుంచి ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీకి చేరుకుంది.
ఢిల్లీకి ఉదయం వచ్చిన ఐదో ఎయిరిండియా విమానంలో 11 మంది తెలంగాణ విద్యార్థులు, ఏపీ విద్యార్థులు ఉన్నారు. ఆదివారం నుంచి సోమవారం వరకు యుక్రెయిన్ నుంచి భారత్‌కు ఏపీ, తెలంగాణ కలిపి మొత్తంగా 58 మంది తెలుగులు విద్యార్థులు క్షేమంగా భారత్ చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న తెలుగు విద్యార్థులను వారి స్వస్థలాలకు పంపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తమ స్వస్థలాలకు వెళ్లేంతవరకు తెలుగు విద్యార్థులకు ఉండేందుకు ఢిల్లీలోనే బస కూడా ఏర్పాటు చేశారు. బుకారెస్ట్ నుంచి ఢిల్లీకి చేరిన రెండో విమానంలో 250మంది భారతీయులు ఉన్నారు. వారిలో 11మంది ఏపీ విద్యార్థులు, 17మంది తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. అలాగే ముంబై చేరుకున్న విమానంలో 20 మంది తెలుగు విద్యార్థులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
Read Also : Shamshabad : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న 20 మంది తెలుగు విద్యార్థులు
యుక్రెయిన్ నుంచి ముంబైకి విమానంలో 219మంది విద్యార్థులు చేరుకున్నారు. యుక్రెయిన్ యుద్ధ వాతావరణంతో భయాందోళనకు గురైన భారతీయులు మూడు రోజులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. కేంద్ర ప్రభుత్వం చొరవతో భారతీయులంతా శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు క్షేమంగా చేరుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. యుక్రేనియన్‌లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు ప్రత్యేక విమానంలో 20 మంది ముంబైకి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిని ముంబై నుంచి ఇండిగో విమనంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు తరలించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో తెలంగాణ ప్రభుత్వం తరపున రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలుగు విద్యార్థులకు స్వాగతం పలికారు.
యుక్రెయిన్ నుంచి క్షేమంగా చేరుకున్న విద్యార్థులను చూడగానే వారి తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. దేవుడి దయవల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో తమ పిల్లలు స్వదేశానికి సేఫ్‌గా చేరుకున్నందకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను సురక్షితంగా చేర్చిన ఏపీ, తెలంగాణతో పాటు ఇండియన్ ఎంబసీకి విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెబుతున్నారు. మరోవైపు.. జహోనీ క్రాసింగ్ వద్ద యుక్రెయిన్ నుంచి హంగేరీలో భారతీయ విద్యార్థులు బ్యాచ్‌లుగా వస్తున్నారని, హంగేరీలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. అక్కడి నుంచి వారిని బుడాపెస్ట్‌కు తరలించనున్నారు. ఎయిర్ ఇండియా మూడో విమానం ద్వారా ఇండియాకు తరలించనున్నట్టు అధికారులు వెల్లడించారు. యుక్రెయిన్ నుంచి బయటపడే క్రమంలో పోలాండ్ సరిహద్దుల్లో భారత విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
శరణార్దులపై పోలాండ్ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. గాలిలో కాల్పులు జరుపుతూ బెదిరించారు. పోలాండ్ పోలీసుల తీరుపై విద్యార్ధులు మండిపడుతున్నారు. ఉక్రెయిన్ నుంచి వచ్చే భారతీయ విద్యార్ధులకు వీసాలు లేకుండానే అనుమతిస్తామని యుక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ, సరిహద్దుల్లో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుక్రెయిన్ నుంచి ఒకేసారి లక్షలాదిమంది పోలాండ్ సరిహద్దుకు తరలిరావడంతో ఇబ్బందికరంగా మారిందని విదేశాంగశాఖ అధికారులు చెబుతున్నారు. యుక్రెయిన్‌లో చిక్కుకున్న 908 మంది విద్యార్ధులను ఇప్పటివరకు భారత్‌కు చేర్చినట్టు తెలిపారు. రష్యా – యుక్రెయిన్ సంక్షోభం ప్రారంభమైన తరువాత 4వేల మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్టు విదేశాంగశాఖ వెల్లడించింది. మరో 15 వేల మంది భారతీయులు యుక్రెయిన్ ఉన్నారని తెలిపింది. వారిని కూడా సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని విదేశాంగశాఖ వెల్లడించింది.
Read Also : North Korea : అమెరికా వల్లనే యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర.. అగ్రరాజ్యంపై ఉత్తరకొరియా ఆగ్రహం!