Ajay Bhupathi: మంగళవారం మరో RX 100 అంటోన్న డైరెక్టర్!
‘ఆర్ఎక్స్ 100’ మూవీతో టాలీవుడ్‌లో దర్శకుడిగా తనదైన మార్క్ వేసుకున్నాడు అజయ్ భూపతి. ఆయన తెరకెక్కించిన ఈ బోల్డ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ యూత్‌ను ఏ విధంగా కట్టిపడేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా అజయ్ భూపతి మరోసారి తనదైన మార్క్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కథను రెడీ చేస్తున్నాడట.

Ajay Bhupathi Next Movie Titled Mangalavaaram
Ajay Bhupathi: ‘ఆర్ఎక్స్ 100’ మూవీతో టాలీవుడ్‌లో దర్శకుడిగా తనదైన మార్క్ వేసుకున్నాడు అజయ్ భూపతి. ఆయన తెరకెక్కించిన ఈ బోల్డ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ యూత్‌ను ఏ విధంగా కట్టిపడేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క సినిమాతో ఓవర్‌నైట్‌లో అందరి చూపులు ఆయనపై పడ్డాయి. ఇక ఈ దర్శకుడికి ఇండస్ట్రీలో ఎదురే లేదని అందరూ అనుకున్నారు. ఇదే జోరుతో ఆయన ‘మహాసముద్రం’ అనే సినిమాను కూడా తీశాడు.
Ajay Bhupathi : ప్రేక్షకులకి క్షమాపణలు చెప్పిన ‘ఆర్‌ఎక్స్ 100’ డైరెక్టర్
కానీ, రెండో సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా సక్సెస్ కాకపోవడంతో, అజయ్ భూపతి మళ్లీ వెనకబడిపోయాడు. ఇక తన నెక్ట్స్ సినిమాను ఇప్పటివరకు ఆయన అనౌన్స్ చేయకపోవడంతో అభిమానులు అజయ్ భూపతి నుండి మరో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా అజయ్ భూపతి మరోసారి తనదైన మార్క్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కథను రెడీ చేస్తున్నాడట. ఈ సినిమా కూడా ఆర్ఎక్స్ 100 తరహాలో ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
Ajay Bhupathi : యాటిట్యూడ్ మార్చుకో.. లేదంటే ఇండస్ట్రీలో ఉండవ్..
కాగా, ఈ సినిమాకు ‘మంగళవారం’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఆయన ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. టైటిల్‌తోనే సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసిన అజయ్ భూపతి, ఈ సినిమాను లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టుగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించబోయేది ఎవరనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అజయ్ భూపతి తన స్నేహితులతో కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనుండగా, వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభించి 2023 వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.