అభిమానులకు అల్లు అర్జున్ అభివాదం..

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తూర్పు గోదావరిలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతోంది.
చిత్రీకరణలో భాగంగా చిత్ర యూనిట్ ఖమ్మంలోని మోతు గూడెంకు వెళ్లింది. విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ భారీ సంఖ్యంలో అల్లు అర్జున్‌ను చూసేందుకు వచ్చారు. స్టైలిష్ స్టార్.. స్టైలిష్ స్టార్.. అంటూ గోల చేశారు.. విషయం తెలుసుకున్న స్టైలిష్‌స్టార్ కార్వాన్ నుంచి బయటకు వచ్చి అభిమానులను పలకరించారు. దీంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యారు.
https://10tv.in/pushpa-raj-will-begin-his-hunt-on-aug-13th-2021/
ఈ మూవీలో బన్నీ ఊరమాస్ గెటప్‌లో సరికొత్తగా కనిపిస్తున్నాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఆగస్టు 13న ‘పుష్ప’ తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.