Bheemla Nayak: పార్టీకి లేటైంది పుష్ప..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది......

Bheemla Nayak: పార్టీకి లేటైంది పుష్ప..!

Allu Arjun Tweet On Bheemla Nayak

Updated On : March 24, 2022 / 2:56 PM IST

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరోసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మనకు కనిపించాడు. కాగా ఈ సినిమాలో యంగ్ హీరో రానా దగ్గుబాటి పవన్‌ను ఢీకొనే పాత్రలో నటించి ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నాడు.

Bheemla Nayak: ఓటీటీలో వచ్చేస్తుంది.. ఇక హిందీ రిలీజ్ లేనట్లేనా?

ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుని అదిరిపోయే కలెక్షన్లు వసూలు చేసింది. ఇక ఈ సినిమా గురించి పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. అయితే తాజాగా భీమ్లా నాయక్ చిత్రం గురించి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ పోస్ట్ పెట్టాడు. భీమ్లా నాయక్ పార్టీకి లేటైందని.. ఇలాంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న పవన్ కళ్యాన్, రానా దగ్గుబాటి, త్రివిక్రమ్, సాగర్ కె చంద్ర అండ్ టీమ్ అందరికీ అభినందనలు అంటూ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.

అయితే భీమ్లా నాయక్ చిత్రాన్ని నేడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఆహా రెండు ఓటీటీల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సినిమాను తాజాగా వీక్షించిన బన్నీ ఈ మేరకు పోస్ట్ పెట్టాడు. అయితే సినిమా రిలీజ్ సమయంలో కాకుండా ఇలా ఓటీటీలో సినిమా రిలీజ్ అయిన సందర్భంగా బన్నీ పెట్టిన పోస్ట్‌పై సోషల్ మీడియాలో పలు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Bheemla Nayak: గుడ్ న్యూస్.. ఒకరోజు ముందే ‘ఆహా’లో భీమ్లా నాయక్!

ఇందులో ముఖ్యంగా బన్నీ స్వయంగా పార్టీకి లేటైందని అనడంతో.. పుష్ప చిత్రంలోని ఫహాద్ ఫాజిల్ చెప్పిన డైలాగ్.. ‘పార్టీ లేదా పుష్పా’ను ‘పార్టీకి లేటైంది పుష్పా’ అంటూ మార్చి అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. ఇక భీమ్లా నాయక్ చిత్రంలో పవన్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించారు.

Bunny Post On Bheemla Nayak

Bunny Post On Bheemla Nayak