Amit Shah: ఏడాది గ్యాప్ తర్వాత 10మంది సీఎంలతో అమిత్ షా భేటీ

కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. నక్సల్స్ ప్రభావిత 10రాష్ట్రాల సీఎంలతో ఆదివారం భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం యాంటీ నక్సల్ ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయని తెలుసుకోనున్నారు.

Amit Shah: ఏడాది గ్యాప్ తర్వాత 10మంది సీఎంలతో అమిత్ షా భేటీ

Amit Sha

Updated On : September 26, 2021 / 12:51 PM IST

Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. నక్సల్స్ ప్రభావిత 10రాష్ట్రాల సీఎంలతో ఆదివారం భేటీ కానున్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం యాంటీ నక్సల్ ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయని తెలుసుకోనున్నారు. భద్రత.. అభివృద్ధి భవిష్యత్ కార్యచరణ అంశాలపై చర్చించనున్నారు. న్యూ ఢిల్లీలోని విగ్యాన్ భవన్ వేదికగా మీటింగ్ జరగనుంది.

ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేవ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ సీఎంలు మీటింగ్ కు హాజరవుతారు. ప్రతి రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితిని, డెవలప్మెంట్ ప్రాజెక్టులను రాష్ట్ర హోం మంత్రులు వివరిస్తారు.

‘అవసరానికి తగ్గట్లుగా సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు నక్సల్స్ నేపథ్యంలో మీటింగ్ జరుగుతూనే ఉంటుంది. గతేడాది కొవిడ్-19కారణంగా మీటింగ్ జరగలేదు’ అని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.

బీహార్ సీఎం నితీశ్ కుమార్.. శనివారం దేశరాజధానికి వచ్చారు. ఆదివారం మీటింగ్ లో నక్సల్ ప్రభావిత ప్రాంతాల గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయనున్నారు. దీనిని బట్టి చూస్తుంటే నక్సల్స్ ఎఫెక్టెడ్ ఏరియాల్లో జరుగుతున్న ఆపరేషన్ల గురించి కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది.

 

………………………: త్వరలో కొత్త కోఆపరేటివ్ పాలసీ