Anasuya Bharadwaj : సునీల్ పక్కన అనసూయ!

తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా రాణిస్తున్న అనసూయ క్యారెక్టర్ నచ్చితే వెండితెరపై కూడా సత్తా చాటుతోంది.. ‘రంగస్థలం’ లో రంగమ్మత్త, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘క్షణం’ సినిమాల్లో ఆమె చేసిన పాత్రలను ఉదాహరణగా చెప్పవచ్చు..

Anasuya Bharadwaj : సునీల్ పక్కన అనసూయ!

Updated On : August 6, 2021 / 3:33 PM IST

Anasuya Bharadwaj: తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా రాణిస్తున్న అనసూయ క్యారెక్టర్ నచ్చితే వెండితెరపై కూడా సత్తా చాటుతోంది.. ‘రంగస్థలం’ లో రంగమ్మత్త, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘క్షణం’ సినిమాల్లో ఆమె చేసిన పాత్రలను ఉదాహరణగా చెప్పవచ్చు.. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ అటునుండి మాలీవుడ్ ఇండస్ట్రీల్లో కూడా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది అనసూయ.

Anasuya

‘థ్యాంక్ యు బ్రదర్!’ అనే డిఫరెంట్ మూవీ కంప్లీట్ చేసింది. ఈ సినిమాలో గర్భవతిగా ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేసిన అనసూయ, కార్తికేయ హీరోగా నటిస్తున్న ‘చావు కబురు చల్లగా’ లో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. అలాగే మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘ఖిలాడి’ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. వీటితో పాటు ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి సినిమాతో తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న ‘భీష్మ పర్వం’ సినిమాలో ఓ ముఖ్య పాత్రకు స్టార్ యాంకర్ అనసూయను ఫిక్స్ చేశారు.

 

అలాగే పాపులర్ కమెడియన్ కమ్ హీరో సునీల్‌తోనూ అనసూయ నటించనుంది. సునీల్ టైటిల్ పాత్రలో నటిస్తున్న సినిమా ‘వేదాంతం రాఘవయ్య’.. ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ ఈ చిత్రానికి కథనందించడంతో పాటు సమర్పకులుగానూ వ్యవహరిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సునీల్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది అనసూయ. గతంలో జూనియర్ ఎన్టీఆర్ ‘నాగ’ సినిమాలో అనసూయ కాలేజ్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో సునీల్ పక్కన కనిపించింది.

Anasuya