ఫేస్ బుక్ ప్రేమ… పెళ్లి పేరుతో మోసం..సహాయ దర్శకురాలి ఆవేదన

పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఒక సినీ సహాయ దర్సకురాలు తన ప్రియుడిపై బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మారుతీ నగర్ లో నివాసం ఉండే 32 సంవత్సరాల సినీ సహాయ దర్శకురాలికి 2018 లో ఫేస్ బుక్ ద్వారా ఒక వ్యకి పరిచయం అయ్యాడు. అనంతరం వారిద్దరూ ఫోన్ నెంబర్లు తెలుసుకుని ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం మొదలెట్టారు. క్రమంగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
నిన్నే పెళ్లాడుతా అంటూ ప్రియుడు చెప్పిన మాటలు నమ్మి అతడితో శారీరకంగా కలిసింది. ఇద్దరూ ప్రేమ జీవితాన్ని ఎంజాయ్ చేయసాగారు. కొంతకాలానికి ఇలా ఎందుకు భయపడుతూ కలవటం హాయిగా పెళ్లి చేసుకుని జీవితాన్ని ఎంజాయ్ చేద్దామని సహాయ దర్సకురాలు తన ప్రియుడిని కోరింది. తన మససులో మాట తాపీగా బయట పెట్టాడు. ఇంట్లో వాళ్లు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానన్నాడు. షాక్ కు గురైంది.
మన ప్రేమ సంగతి …శారీరకంగా కలిసిన సంగతి ఏంటని నిలదీసింది. మన మధ్య ప్రేమ విషయం ఎవరికైనా చెపితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అనంతరం సొణ్ణేనహళ్లిలో ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ ఆమెతో కాపురం పెట్టాడు. ఆమె పరిచయం అయినప్పటి నుంచి ఆమె వద్ద అవసరానికి డబ్బులు తీసుకుని వాడుకుంటూ ఉండేవాడు.
అలాగే ఈ ఏడాది జనవరి 12న మరో రూ.5 లక్షలు కావాలని అడిగాడు. ఈసారి డబ్బులు ఇచ్చేందుకు ఆమె నిరాకరించింది. ఆ తర్వాత నుంచి ఆమెకు కనపడకుండా తప్పించుకు తిరుగటం మొదలెట్టాడు. కొన్నాళ్ళకు ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేశాడు. దీంతో బాధితురాలు బసవనగుడి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.