Maharashtra: ఏటీఎం నుంచి విత్ డ్రా చేసే దాని కంటే 5 రెట్లు ఎక్కువ డబ్బు.. భారీగా వచ్చిన జనాలు
ఓ బ్యాంకు ఏటీఎం నుంచి రూ.500 డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు ఓ వ్యక్తి వెళ్లాడు. అయితే, అతడు రూ.500 విత్ డ్రా చేస్తే ఏటీఎం నుంచి రూ.2,500 వచ్చాయి.

How To Withdraw Money From Atm Without Debit Or Credit Card
Maharashtra: ఓ బ్యాంకు ఏటీఎం నుంచి రూ.500 డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు ఓ వ్యక్తి వెళ్లాడు. అయితే, అతడు రూ.500 విత్ డ్రా చేస్తే ఏటీఎం నుంచి రూ.2,500 వచ్చాయి. బ్యాంకు ఖాతా నుంచి మాత్రం రూ.500 మాత్రమే కట్ అయ్యాయి. ఉబ్బితబ్బిబ్బయిపోయి మళ్లీ రూ.500 విత్ డ్రా చేయడానికి ప్రయత్నించగా, మళ్లీ అతడికి ఏంటీఎం నుంచి రూ.2,500 వచ్చాయి. వాటిని తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. ఆ ఏంటీఎం నుంచి విత్ డ్రా చేయాలనుకుంటోన్న దాని కంటే ఐదు రెట్లు అధికంగా డబ్బు వస్తుందన్న విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు.
congress: మాపై పోలీసులు దాడి చేశారు: లోక్‌సభ స్పీకర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు
ఆ ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసుకోవడానికి పోటీ పడ్డారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలోని ఖాపెర్ఖెడా నగరంలో ఉన్న ఓ ప్రైవేటు బ్యాంకు ఏటీఎంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చివరకు ఓ వ్యక్తి ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని, ఏటీఎంను మూసి వేశారు. అనంతరం ఈ విషయంపై బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. బ్యాంకు ఏటీఎం వద్ద చోటు చేసుకున్న ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని చెప్పారు.