congress: మాపై పోలీసులు దాడి చేశారు: లోక్‌స‌భ స్పీక‌ర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు congress gives complaint against ed and police

congress: మాపై పోలీసులు దాడి చేశారు: లోక్‌స‌భ స్పీక‌ర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు

నేష‌న‌ల్ హెరాల్డ్ దిన‌ప‌త్రికకు సంబంధించిన న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచారించిన తీరుపై ఆ పార్టీ నేత‌లు మండిప‌డ్డారు.

congress: మాపై పోలీసులు దాడి చేశారు: లోక్‌స‌భ స్పీక‌ర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు

congress: నేష‌న‌ల్ హెరాల్డ్ దిన‌ప‌త్రికకు సంబంధించిన న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచారించిన తీరుపై ఆ పార్టీ నేత‌లు మండిప‌డ్డారు. రాహుల్ గాంధీని విచారించిన తీరు, కాంగ్రెస్ ఎంపీల పట్ల ఢిల్లీ పోలీసులు అనుసరించిన వైఖరిపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆ పార్టీలు ఎంపీలు ఫిర్యాదు చేశారు. అనంత‌రం కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత అధీర్ రంజన్ చౌధురి మీడియాతో మాట్లాడుతూ.. తాము చెప్పిన విషయాలన్నింటినీ స్పీకర్ విన్నారని అన్నారు.

Donkey Milk Farm: ఐటీ జాబ్ వదిలి గాడిద పాల వ్యాపారం

కాంగ్రెస్ ఎంపీలపై ఢిల్లీ పోలీసులు దాడికి పాల్పడ్డారని అధీర్ రంజన్ చౌధురి చెప్పారు. అలాగే, కాంగ్రెస్ కార్యాలయంలోకి చొరబడ్డారని తెలిపారు. చాలామంది కాంగ్రెస్ ఎంపీలకు గాయాలయ్యాయని అన్నారు. కాంగ్రెస్ నేతలను ఉగ్రవాదులగా పరిగణిస్తున్నారంటూ మండిప‌డ్డారు. రాహుల్ గాంధీని గంటల కొద్దీ ప్రశ్నిస్తున్నారని చెప్పారు. అలాగే, రాహుల్ గాంధీని వేధిస్తున్నారని, ఇటీవలి కాలంలో ఎన్న‌డూ ఒక నేతను ఇన్ని గంటల పాటు ప్రశ్నించిన పరిస్థితి లేదని అన్నారు.

Gas Problem : గ్యాస్ సమస్యకు చెక్ పేట్టే ఇంటి చిట్కాలు!

రాహుల్ గాంధీకి మద్దతుగా తాము ఈడీ కార్యాలయానికి శాంతియుతంగా ర్యాలీగా వెళ్లాల‌నుకున్నామ‌ని చెప్పారు. కాంగ్రెస్ మహిళా ఎంపీపై పోలీసులు దాడి చేశారని, బట్టలు చింపేశారని అన్నారు. ఎంపీ జ్యోతి మణిపై పోలీసులు దాడి చేశారని, తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదని చెప్పారు. రాత్రి ఇంటికి వచ్చాక జ్యోతి మణి ఏడుస్తూనే ఉన్నార‌ని చెప్పారు. భార‌త్‌లో ఎప్పుడూ నిర‌స‌న‌లు జరగలేదా అని నిల‌దీశారు. గాంధేయ మార్గంలో శాంతి పూర్వకంగా నిరసన తెలపాలనుకోవడం తప్పా అని ప్ర‌శ్నించారు.

×