Cooler Auto : ‘కూలర్ ఆటో చూసారా?’ ఆటో డ్రైవర్ సూపర్ ఐడియా

సమయాన్ని కొందరు భలే సద్వినియోగం చేసుకుంటారు. ఓ ఆటో డ్రైవర్ వేసవికాలంలో తన ఆటో గిరాకీ ఏ మాత్రం తగ్గకుండా సూపర్ ఐడియా ఫాలో అయ్యాడు. ప్రయాణికులకు ఎండ వేడి తెలియకుండా ఆటోకి కూలర్ అటాచ్ చేసేసాడు. ఇక అతని ఆటో ఎక్కితే ప్రయాణికులు హాయిగా.. చల్లగా ప్రయాణం చేయవచ్చు.

Cooler Auto : ‘కూలర్ ఆటో చూసారా?’ ఆటో డ్రైవర్ సూపర్ ఐడియా

Viral Video

Updated On : June 1, 2023 / 12:32 PM IST

Viral Video: ఎవరికి రాని ఐడియాలు వచ్చినా.. ఎవరూ చేయని పని చేసినా అది అందరికి నచ్చితే ఎక్కడ లేని గుర్తింపు వచ్చేస్తుంది. కొందరికి భలే ఐడియాలు వస్తుంటాయి. మండే ఎండల్లో ఆటో ఎక్కే ప్రయాణికుల కోసం ఓ ఆటో డ్రైవర్‌కి వచ్చిన ఐడియా అదుర్స్.. ఇక అతని ఆటో జనం ఎక్కకుండా ఉంటారా?

Ira Khan : ఆటోలో ప్రయాణించిన అమీర్ ఖాన్ కూతురు.. వీడియో వైరల్..

ఎండల్లో అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే సొంత వెహికల్.. లేదంటే బస్సు, ఆటో పట్టుకోవాల్సిందే. ఏది ఎక్కినా నెత్తిన ఎండ ఠారెత్తిస్తుంటే ఇక ప్రయాణం చికాకు మధ్య సాగుతుంది. ఎండలకు భయపడి ప్రయాణికులు ఆటో ఎక్కడం మానేస్తారేమో అని.. తన ఆటోలో చల్లదనం ఉంటే గిరాకీ కూడా బాగుంటుందని ఆలోచించాడేమో ఓ ఆటో డ్రైవర్ .. తన ఆటోకి కూలర్‌ని ఫిక్స్ చేసేసాడు. ఇక ఆటోలో ప్రయాణించేవారు చల్ల చల్లగా.. కూల్ కూల్‌గా ప్రయాణం చేయవచ్చును కదా..

 

ఇతనికి వచ్చిన ఐడియాని మెచ్చుకోని వారు లేరంటే నమ్మండి.. వేసవి అంతా భలే గిరాకీ కూడా అందుకుని ఉంటాడు. చేసే పనిలో క్రియేటివ్‌గా ఆలోచించడం,దానిని మనకు లాభసాటిగా మార్చుకోవడం అంటే ఇదేనేమో. kabir_setia అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోని షేర్ చేశారు.

Bengaluru : బెంగళూరులో ఉబెర్ ఆటో బుక్ చేసుకున్నారా? ఇక గమ్యస్ధానానికి చేరినట్లే..

‘ఇంజనీర్ బహుశా ఆటో డ్రైవర్ అయ్యాడేమో’ అని.. ‘ఆటోట్రైవర్ తెలివి తేటలకు సెల్యూట్ చేయాలని’ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఇకపై వేసవికాలం వస్తే ఈ ఆటోడ్రైవర్ ఐడియాని చాలామంది ఫాలో అయిపోయినా ఆశ్చర్యం లేదు.

 

View this post on Instagram

 

A post shared by KABIR SETIA (@kabir_setia)