Bandla Ganesh : ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. ఓటు వేయండి..

తాజాగా బండ్ల గణేష్ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో.. ''నేను త్వ‌ర‌లో జరగబోయే హైద‌రాబాద్‌లోని ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ (FNCC) ఎన్నిక‌ల్లో పాల్గొన‌బోతున్నాను. మీ చేతుల్లో...............

Bandla Ganesh : ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. ఓటు వేయండి..

Bandla Ganesh contesting in FNCC Elections

Updated On : September 17, 2022 / 11:47 AM IST

Bandla Ganesh :  నటుడిగా, నిర్మాతగా టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు బండ్ల గణేష్. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా, ఆయన మీద ఇచ్చే స్పీచ్ లతో బాగా పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఎప్పుడూ ఏదో ఒక రకంగా వార్తల్లో ఉంటాడు బండ్ల గణేష్. ఇక తాను చేసే ట్వీట్స్ కూడా వైరల్ అవుతుంటాయి. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా బండ్లన్న కి హస్తం ఉంది.

గతంలో కాంగ్రెస్ లో కొన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నారు. ఇక మా ఎలక్షన్స్ లో పోటీ చేస్తానని ప్రకటించి చివరి నిమిషంలో తప్పుకున్నాడు. తాజాగా మరో ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నా, ఓటు వేయండి అంటున్నాడు బండ్లగణేష్.

Manchu Vishnu : నేను పది పుషప్స్ చేశాక దున్నపోతులా ఊహించుకుంటాను.. ట్రోల్ అవుతున్న మంచు విష్ణు ట్వీట్..

తాజాగా బండ్ల గణేష్ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో.. ”నేను త్వ‌ర‌లో జరగబోయే హైద‌రాబాద్‌లోని ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ (FNCC) ఎన్నిక‌ల్లో పాల్గొన‌బోతున్నాను. మీ చేతుల్లో మార్చే శ‌క్తి, అవ‌కాశం ఉంది. FNCC ఎన్నిక‌ల్లో వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్నాను. మీ అమూల్య‌మైన ఓటు నాకే వేయండి. ఒక్క ఓటు వేయండి” అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ ఎలక్షన్స్ ఆ క్లబ్ లో ఉన్న మెంబర్లకు మాత్రమే. అయితే ఇలా ఓ చిన్న క్లబ్ ఎలక్షన్స్ లో పోటీ చేయడంపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.