Vice Presidential candidate: ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్
ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ (71) పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ ప్రకటించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఇతర బీజేపీ కీలక నేతలు ఇందులో పాల్గొన్నారు.

Jagdeep Dhankar
vice-presidential candidate: ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ (71) పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ ప్రకటించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఇతర బీజేపీ కీలక నేతలు ఇందులో పాల్గొన్నారు. ఇందులోనే, ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలన్న అంశంపై నిర్ణయం తీసుకున్నారు.
Maharashtra: ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్ల మార్పు.. ‘మహా’ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఉపరాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థి రేసులో జగదీప్ ధన్కర్ పేరు వినపడకపోయినప్పటికీ ఆయననే బీజేపీ పోటీలో దింపుతోంది. వచ్చే నెల 10తో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి పదవీకాలం ముగియనుంది. కొత్త ఉప రాష్ట్రపతిని 788 మంది లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పోటీ అనివార్యం అయితేనే ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. కాగా, జగదీప్ స్వస్థలం రాజస్థాన్. ఆయన కెరీర్ మొదట్లో సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్ సింగ్ హయాంలో కేంద్ర సహాయ మంత్రిగానూ పనిచేశారు.