Mamata Banerjee: యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌గా సీఎం.. బెంగాల్‌లో కొత్త చట్టం

రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఛాన్స్‌లర్‌గా ఇకపై సీఎం వ్యవహరించేలా కొత్త చట్టం రూపొందించింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. సీఎం మమతా బెనర్జీ అధ్యక్షతన గురువారం సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కొత్త చట్టాన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది.

Mamata Banerjee: యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌గా సీఎం.. బెంగాల్‌లో కొత్త చట్టం

Mamata Banerjee

Updated On : May 26, 2022 / 8:17 PM IST

Mamata Banerjee: రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఛాన్స్‌లర్‌గా ఇకపై సీఎం వ్యవహరించేలా కొత్త చట్టం రూపొందించింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. సీఎం మమతా బెనర్జీ అధ్యక్షతన గురువారం సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కొత్త చట్టాన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలోని యూనివర్సిటీలకు గవర్నర్ ఛాన్స్‌లర్‌గా ఉంటున్నారు.

Modi Speech: ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపుతున్న భారత్: మోదీ

కొత్త చట్టం ఆమోదం పొందితే, సీఎం ఛాన్స్‌లర్‌ అవుతారు. కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అక్కడ ఆమోదించిన తర్వాత, గవర్నర్ కూడా అంగీకారం తెలపాల్సి ఉంటుంది. గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత నుంచి ఈ చట్టం అమల్లోకొస్తుంది. పశ్చిమ బెంగాల్‌లోని యూనివర్సిటీల విషయంలో కొంతకాలంగా సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కార్ మధ్య వివాదం నడుస్తోంది. దీంతో గవర్నర్‌ నుంచి ఛాన్స్‌లర్‌ పదవిని తీసుకోవాలని మమత భావిస్తోంది. దీనికోసమే కొత్త చట్టాన్ని క్యాబినెట్ ఆమోదించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును సభలో ప్రవేశపెడతామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బ్రత్యా బసు తెలిపారు. దీనిపై రాజ్‌భవన్ వర్గాల నుంచి ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలోని 17 యూనివర్సిటీలకు గవర్నర్ ఎక్స్-అఫీషియో ఛాన్స్‌లర్‌గా కొనసాగుతున్నారు.

Botsa Satyanarayana: మా నాయకుల ఇండ్లు మేమే తగులబెట్టుకుంటామా: బొత్స

కాగా, ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ స్పందించింది. ‘‘మమతా బెనర్జీ అధికారం అంతా తన చేతుల్లోనే ఉండాలనుకుంటోంది. తనను ఎవరూ ప్రశ్నించకూదనేది ఆమె ఉద్దేశం. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుంది’’ అని బీజేపీ విమర్శించింది.