కాషాయ పార్టీలో సినీగ్లామర్.. బీజేపీలో చేరిన ప్రముఖ నటి!

కాషాయ పార్టీలో సినీగ్లామర్.. బీజేపీలో చేరిన ప్రముఖ నటి!

Updated On : March 2, 2021 / 10:16 AM IST

Popular Bengali film actress Srabanti Chatterjee:పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ.. చేరికలు, తీసివేతలు సాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో సినీగ్లామర్ ఎక్కువ కాగా.. ఆ పార్టీ అధినేత, సీఎం మమతా బెనర్జీ పైనా గత కొన్నాళ్లుగా తీవ్రస్థాయిలో పోరాటం సాగిస్తున్న బీజేపీ.. సినీగ్లామర్‌ని చేర్చుకుంటోంది. ఈ క్రమంలోనే బెంగాలీ సినీ తార స్రబంతి ఛటర్జీ బీజేపీలో చేరారు.

తన అందచందాలతో బెంగాల్ ప్రజలను సమ్మోహితులను చేసిన స్రబంతి కోల్‌కతాలో కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్ వర్గియా, బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమక్షంలో స్రబంతి పార్టీలో చేరారు. స్రబంతి ఛటర్జీని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు బీజేపీ చెప్పింది.