Bigg Boss 4 Grand Finale: అతిథులుగా చైతు, సాయి పల్లవి!

Bigg Boss 4 Grand Finale: అతిథులుగా చైతు, సాయి పల్లవి!

Updated On : December 19, 2020 / 6:38 PM IST

Bigg Boss 4 Grand Finale: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 మరికొద్ది గంటల్లో ముగియనుంది. ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరనేది.. హోస్ట్ కింగ్ నాగార్జున సమక్షంలో.. చీఫ్ గెస్ట్ మెగాస్టార్ చిరంజీవి ప్రకటించనున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బిగ్ బాస్ గురించే చర్చ జరుగుతోంది. స్టార్ మా యాజమాన్యం గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌ను భారీ స్థాయిలో ఏర్పాటు చేసింది.

ఈ కార్యక్రమానికి ‘లవ్ స్టోరీ’ మూవీ జంట యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి ప్రత్యేక అతిథులుగా రాబోతున్నారని తెలుస్తోంది. లాక్‌డౌన్ కారణంగా ఈ సారి హౌస్‌లో ఎటువంటి సినిమా ప్రమోషన్లు జరగలేదు. ఈ నేపథ్యంలో రిలీజ్‌కి రెడీగా ఉన్న తమ ‘లవ్ స్టోరీ’ సినిమా ప్రమోషన్ కోసం చైతు, సాయి పల్లవి హాజరుకానున్నారట.