Arjun Singh Rreturns to TMC: బెంగాల్‌లో బీజేపీకి షాక్.. టీఎమ్‌సీ గూటికి బీజేపీ ఎంపీ

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ అర్జున్ సింగ్ ఆదివారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎమ్‌సీ)లో చేరారు. కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో టీఎమ్‌సీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో అర్జున్ సింగ్ పార్టీ జెండా కప్పుకున్నారు.

Arjun Singh Rreturns to TMC: బెంగాల్‌లో బీజేపీకి షాక్.. టీఎమ్‌సీ గూటికి బీజేపీ ఎంపీ

Arjun Singh Rreturns To Tmc

Updated On : May 22, 2022 / 8:45 PM IST

Arjun Singh Rreturns to TMC: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ అర్జున్ సింగ్ ఆదివారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎమ్‌సీ)లో చేరారు. కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో టీఎమ్‌సీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో అర్జున్ సింగ్ పార్టీ జెండా కప్పుకున్నారు.

Heavy Rains: చల్లటి కబురు.. దేశవ్యాప్తంగా వానలు

ప్రస్తుతం అర్జున్ సింగ్ బరాక్ పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు. బీజేపీకి రాష్ట్రంలో కీలక నేతగా ఉంటూ, ఎంపీ కూడా అయిన అర్జున్ సింగ్ టీఎమ్‌సీలో చేరడంతో, పశ్చిమ బెంగాల్‌లో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అయితే, అర్జున్ సింగ్ గతంలో టీఎమ్‌సీలోనే ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆ పార్టీని వీడి, బీజేపీలో చేరారు. తాజాగా 38 నెలల తర్వాత సొంతపార్టీ గూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన విమర్శలు గుప్పించారు. తాను ఎంపీగా ఎన్నికైన ప్రాంతంలో జూట్లు ఎక్కువగా ఉంటారని, కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాళ్ల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. కేంద్ర విధానాల వల్ల జూట్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ‘‘బీజేపీ కేవలం ఫేస్‌బుక్, ట్విట్టర్‌లోనే ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా రాజకీయం చేయడం కుదరదు.

BJP Ultimatum: పెట్రో ధరల తగ్గింపుపై తమిళనాడు ప్రభుత్వానికి బీజేపీ అల్టిమేటమ్

రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే గుర్తింపు. బీజేపీ నాయకులు ఏసీ రూముల్లో కూర్చోవడం వల్ల ప్రజల్లో విలువ కోల్పోతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు టీఎమ్‌సీ ప్రయత్నిస్తోంది’’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే, తాను టీఎమ్‌సీలో చేరినందున ఎంపీ పదవికి రాజీనామా చేయాలంటూ వస్తున్న విమర్శలపై కూడా ఆయన స్పందించారు. తాను రాజీనామా చేయాలంటే ముందుగా టీఎమ్‌సీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.