Deepika Padukone : ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. మా అమ్మ నన్ను అర్ధం చేసుకోవడం వల్లే ఇవాళ ఇలా..

దీపికా పదుకొనే మాట్లాడుతూ.. ''నటిగా నా కెరీర్‌ చాలా బాగున్నప్పుడే నాకు ఎందుకో బాధగా ఉండేది. ఆ బాధకు కారణం తెలీదు. ఏడుపొచ్చేది. అలాంటి టైంలో..........

Deepika Padukone : ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. మా అమ్మ నన్ను అర్ధం చేసుకోవడం వల్లే ఇవాళ ఇలా..

Deepika Padukone

Updated On : August 7, 2022 / 8:25 AM IST

Deepika Padukone :  ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న దీపికా పదుకొనే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న దీపికా ఒకానొక సమయంలో డిప్రెషన్ వల్ల తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అని వ్యాఖ్యలు చేసింది.

ఈ కార్యక్రమంలో దీపికా పదుకొనే మాట్లాడుతూ.. ”నటిగా నా కెరీర్‌ చాలా బాగున్నప్పుడే నాకు ఎందుకో బాధగా ఉండేది. ఆ బాధకు కారణం తెలీదు. ఏడుపొచ్చేది. అలాంటి టైంలో బాధని మర్చిపోవాలంటే నిద్ర ఒక్కటే మార్గం అనుకోని ఎక్కువగా నిద్రపోయేదాన్ని. ఆ సమయంలో ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు కూడా వచ్చాయి. ఆత్మహత్య కూడా చేసుకోవాలి అనుకున్నాను. ఆ సమయంలో నేను ముంబైలో, మా అమ్మ, నాన్న బెంగుళూరులో ఉండేవారు. మా అమ్మ, నాన్న వచ్చినప్పుడు వాళ్ళ ముందు మాత్రం చాలా ఉత్సాహంగా ఉండేదాన్ని. కానీ ఒకసారి మా అమ్మ దగ్గర ఏడ్చేశాను. మా అమ్మ మొదట ఆందోళన చెంది బాధకి కారణం ఏంటి అని అడిగింది. నేనేమి చెప్పలేకపోయాను. ఆ సమయంలో మా అమ్మ నా దగ్గరే ఉంది, నన్ను అర్ధం చేసుకొని చూసుకుంది. ఆ సమయంలో మా అమ్మ ఉండటం వల్లే నేను ఇవాళ ఇలా స్టార్ హీరోయిన్ గా మీ ముందు ఉన్నాను” అని తెలిపింది.

Talasani Srinivas Yadav : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్.. విద్యార్థులకు దేశభక్తి సినిమాలు ఫ్రీగా చూపిస్తాం..

డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఎవరితో అయినా ఉండండి. ఆ సమయంలో మీ బాధని పంచుకోండి అంటూ తెలిపింది దీపికా. ఇప్పుడు రణవీర్ సింగ్ ని పెళ్లి చేసుకొని, వరుస సినిమాలతో బిజీగా ఉంటూ హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తుంది దీపికా పదుకొనే.