Botsa Satyanarayana: మా నాయకుల ఇండ్లు మేమే తగులబెట్టుకుంటామా: బొత్స

వైసీపీ మంత్రులు చేస్తున్న బస్సు యాత్రకు వస్తున్న స్పందన చూసి చంద్రబాబు మతిలేక మాట్లాడుతున్నారని విమర్శించారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Botsa Satyanarayana: మా నాయకుల ఇండ్లు మేమే తగులబెట్టుకుంటామా: బొత్స

Botsa Satyanarayana

Updated On : May 26, 2022 / 3:22 PM IST

Botsa Satyanarayana: వైసీపీ మంత్రులు చేస్తున్న బస్సు యాత్రకు వస్తున్న స్పందన చూసి చంద్రబాబు మతిలేక మాట్లాడుతున్నారని విమర్శించారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మంత్రుల బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. బస్సు యాత్రకు వస్తున్న స్పందన చూసి చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టాలని జనసేన, టీడీపీ కోరాయి. మా మంత్రి, ఎమ్మెల్యే ఇండ్లను మేమే తగులబెట్టుకుంటామా? చంద్రబాబు, పవన్ కల్యాణ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు.

Chandrababu Naidu: కోనసీమలో చిచ్చు పెట్టింది వైసీపీనే: చంద్రబాబు

జిల్లాలకు పేర్లు పెట్టేటప్పుడు 30 రోజుల గడువు పెట్టడం చట్టప్రకారం ఉన్న పద్ధతి. పవన్ కల్యాణ్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. ఇలాంటి అంశాల్లో తెలుసుకుని మాట్లాడాలి. పవన్ కల్యాణ్ అజ్ఞానంతో మాట్లాడటం మాని.. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టాలా? వద్దా? అన్నది స్పష్టం చేయాలి. కోనసీమ విధ్వంసానికి కారణమైన 70 మందిని గుర్తించి, ఇప్పటికే అరెస్టు చేశాం. దీనిపై పోలీసులు సమగ్రంగా విచారణ జరుపుతున్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారో త్వరలో బయటకు వస్తుంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలను చంద్రబాబు కుల వృత్తులకే పరిమితం చేశారు. జగన్ వాళ్లను ఉన్నత స్థానాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు’’ అని బొత్స వ్యాఖ్యానించారు.