మనువడి ఆలోచనతో..యూట్యూబ్ లో దుమ్ములేపుతున్న బామ్మ

మనువడి ఆలోచనతో..యూట్యూబ్ లో దుమ్ములేపుతున్న బామ్మ

Updated On : December 28, 2020 / 9:53 PM IST

Boy Helped His Grandma Become A Successful YouTuber : సోషల్ మీడియాలో ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలంటే..గూగుల్ ఫస్ట్ ప్లేస్‌లో నిలుస్తోంది. తర్వాత..యూ ట్యూబ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎంతో మందికి సహాయ పడుతోంది. అప్‌లోడ్ అయిన వీడియోలు చూసి ఎంతో మంది నేర్చుకున్నారు. అలాగే..ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది. ఎన్నో రకాల వీడియోస్ ఇందులో అప్ లోడ్ చేస్తుంటారు. జీవితాలను పైకి తీసుకరాగాలిగింది.

ఇలాగే..70 ఏళ్ల బామ్మ చేసిన వీడియోస్..ఎంతో పాపులర్ అయ్యాయి. వంటగదిలో గరిటె తిప్పుతూ..ఘుమఘుమలాడే వంటలు చేస్తూ…Youtube సెన్సేషన్‌గా మారిపోయారు. సంప్రదాయ వంటకాలను, కిచెన్ రూంలోనే మసాలాలు తయారు చేస్తూ…అందరి మన్ననలు పొందుతున్నారు. లక్షాలాది మంది ఈమెను ఫాలో అవుతున్నారు. మహారాష్టకు చెందిన వంటల బామ్మ గురించి..తెలుసుకోవాలంటే..చదవండి…

Suman Dhamane. 70 సంవత్సరాలు. ఈమె చేసిన వంటలు 17 ఏళ్ల మనవడు (Yash)కు ఎంతో ఆకట్టుకున్నాయి. యష్‌కు ఒకరోజు ఆలోచన వచ్చింది. తన కుటుంబసభ్యులకే నచ్చడమే కాకుండా..అందరికీ నచ్చే విధంగా చేయాలని అనుకున్నాడు. రుచికరమైన వంటకాలను యూ ట్యూబ్ వేదికగా పంచుకోవాలని డిసైడ్ అయ్యాడు. అంతే…ఈ సంవత్సరం ‘Aapli Aaji’ పేరిట ఉన్న ఓ ఛానెల్‌ నెలకొల్పాడు.

కానీ…Suman Dhamane కి..ఇంటర్నెట్ గురించి తెలియదు. మనువడు Yash సహాయంతో ఇంటర్నెట్‌పై అవగాహన పెంచుకున్నారామె. అలా..మార్చి 25వ తేదీన ఫస్ట్ కాకరకాయ వండి యూ ట్యూబ్‌లో అప్ లోడ్ చేశారామె. వీడియోకు వ్యూస్, లైక్స్ వచ్చాయి. తర్వాత..ఒక్కో వైరెటీ వంటకాలను అప్ లోడ్ చేయడం..లక్షలాది వ్యూస్ రావడం..అంతేస్థాయిలో సబ్ స్క్రైబ్ రావడం జరిగాయి. ఈమె ఛానెల్‌కు 5,80,000 మంది సబ్ స్ర్కైబర్స్ ఉన్నారు. ప్రతి నెలలో 8 మిలియన్లకు పైగా వ్యూస్ ఉన్నాయి.

ఇలాగే…YouTube Creators awardకి ఎంపికయ్యింది. అయితే..ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. ఆమె నిర్వహించే ఛానల్ హ్యాక్‌కు గురైంది. దీనివల్ల..ఆమె ఖాతాను రద్దయ్యింది. కానీ..యూ ట్యూబ్ ఇండియా..సహాయపడింది. తిరిగి ఛానెల్‌ను పునరుద్ధరించేందుకు కృషి చేసింది. ఫలితంగా..మునుపటిలా..వీడియోస్ దూసుకపోతున్నాయి. Suman Dhamane వంట చేస్తూ..వాడే మసాలాలు, పప్పు దినుసులు, సుగంధ ద్రవ్యాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. కొంతమంది తమకు పంపించాలని కోరడం..ఆమె పప్పు దినుసల విక్రయాన్ని కూడా ప్రారంభించారు.