Groom married bride’s sister : ఆ పెళ్లి ఆగిపోవడానికి కారణం పెళ్లికూతురి చెల్లెలు
చాలా సినిమాల్లో చివరి నిముషంలో ఆగిపోయిన పెళ్లి సీన్లు చూస్తుంటాం. రియల్ లైఫ్‌లో ఇలాంటి ఘటనలు చాలా అరుదు. బీహార్‌లో పెళ్లికొడుకు వరమాల వేసే సమయంలో ఈ పెళ్లి వద్దంటూ నిలిపేశాడు. కారణం విని అక్కడి వారంతా షాకయ్యారు.

Groom married bride's sister
Groom married bride’s sister : కాసేపట్లో పెళ్లికూతురి మెడలో పెళ్లికొడుకు వరమాల వేయాలి. పెళ్లికొడుకు ఈ పెళ్లి ససేమిరా ఇష్టం లేదు అన్నాడు. పీటల మీద ఆగిపోతుందేమో అనుకున్న పెళ్లిలో ఓ ట్విస్ట్ జరిగింది.
Old Man Dance Goes Viral : మనవడి పెళ్లిలో 96 ఏళ్ల వృద్ధుడు చేసిన డ్యాన్స్ చూస్తే నోరెళ్లబెడతారు
బీహార్‌లోని సరన్‌లో ఛప్రా నివాసి రాజేష్ కుమార్‌కి రింకు అనే అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి రోజు రానే వచ్చింది. ఇక రాజేష్, రింకూలు పెళ్లి దండలు మార్చుకోవాలి. అంతలోనే రాజేష్ ఈ పెళ్లి తనకు ఇష్టంలేదని చెబుతూ నిలిపివేశాడు. ఏమైందో అర్ధం కాక అందరూ షాకయ్యారు. రాజేష్ కి అప్పుడే రింకూ సోదరి పుతుల్ నుంచి కాల్ వచ్చిందట. తనని కాదని తన సోదరి రింకూని చేసుకుంటే తాను చనిపోతానని. దాంతో రాజేష్ పెళ్లిని ఆపేశాడు.
అసలు విషయం ఏంటంటే రింకూను చూడకముందే పుతుల్‌తో రాజేష్ కు పరిచయం ఉందట. ఇద్దరూ ఇష్టపడ్డారట. అయితే పెద్దవాళ్లు పుతుల్ సోదరి రింకూతో వివాహం నిశ్చయించేసరికి రాజేష్ అడ్డు చెప్పలేకపోయాడు. కానీ చివరి క్షణంలో సినిమా ఫక్కీలో పెళ్లి ఆగిపోయింది.
వీరి ప్రేమ కథ విన్న రెండు కుటుంబాలు ఇక చేసేది లేక రాజేష్, పుతుల్‌కి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాయట. వీరి లవ్ స్టోరి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.