Ram Pothineni: బులెట్ సాంగ్‌ను పట్టుకొస్తున్న వారియర్!
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’ ఇప్పటికే చివరిదశ షూటింగ్‌కు....

Bullet Song From Ram Pothineni The Warrior Movie To Be Out
Ram Pothineni: యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’ ఇప్పటికే చివరిదశ షూటింగ్‌కు చేరుకుంది. ఈ సినిమాలో మరోసారి రామ్ అల్ట్రా స్టైలిష్ లుక్‌తో మనల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో రామ్ తొలిసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాను తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తుండటంతో ది వారియర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
The Warrior : రామ్ కోసం శింబు.. ఏంటా స్పెషల్ అప్డేట్??
ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా నుండి తాజాగా బులెట్ సాంగ్ అనే పాటను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ మేరకు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ బులెట్ సాంగ్ పాటను తమిళ స్టార్ హీరో శింబు పాడారు. దీంతో ఈ పాట ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ పాటను ఏప్రిల్ 22న సాయంత్రం 5.45 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
The Warrior: అఫీషియల్.. రామ్ ది వారియర్ రిలీజ్ డేట్ అనౌన్స్!
కాగా ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, శ్రీనివాస చెట్టూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. జూలై 14న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
#BULLETSONG is coming to you on April 22nd at 5:45pm! @ThisIsDSP has totally rocked this one! ?
Love..#RAPO #TheWarriorr pic.twitter.com/tGaHUd3lnU
— RAm POthineni (@ramsayz) April 18, 2022