Food Processing : ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ లకు సాయం అందించనున్న కేంద్రం..అర్హులు ఎవరంటే..
ఒక్కో యూనిట్ ఏర్పాటుకు గరిష్టంగా 10లక్షల రూపాయల వరకు సహాయం అందజేయనున్నారు. తాము తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్, బ్రాండింగ్ చేయాలనుకుంటే 50శాతం సబ్సిడీతో సహాయం లభించనుంది.

Pmfme
Food Processing : కరోనా అందిరి జీవితాలను కష్టాల మయం చేసింది. పనులు లేక, ఉన్న ఉపాధిని కోల్పోయి చాలా మంది తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం స్ధానిక యువతకు వారి వారి ప్రాంతాల్లోనే ఉపాధి చూపించేలా చర్యలు చేపట్టింది. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజస్ స్కీమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ స్కీమ్ నిరుద్యోగ యువకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి అడుగు పెట్టాలన్న ఆలోచనతో ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక అండదండలను ఈ స్కీమ్ ద్వారా అందిస్తుంది. ఫుడ్ ప్యాకేజింగ్, పానీయాల తయారీ తదితర మైక్రో పరిశ్రమల ఏర్పాటుకు దోహదపడుతుంది. పరిశమ్రల ఏర్పాటుతోపాటు, అందుకు అవసరమైన గోడౌన్లు , కోల్డ్ స్టోరేజ్ , ప్యాకింగ్ యూనిట్లు, ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటుకోసం మౌళిక సదుపాయాల కల్పనకు 35శాతం క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ అందిచనున్నారు.
రాష్ట్రాల్లోని ఆయా జిల్లాల్లో స్ధానికంగా పండే పంటల అధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ ఎలాంటి యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంటుందో గుర్తించాల్సి ఉంటుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుకునేందుకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. మామిడి , బంగాళ దుంప, ఉరగాయ, మిల్లెట్, టమాటా, చేపల ఉత్పత్తులు, మాంసం, కోళ్ళ పెంపకం,తదితర ప్రాధాన్యత మైక్రో పరిశ్రమల ఏర్పాటుకు సహాయం అందజేయనున్నారు.
ఒక్కో యూనిట్ ఏర్పాటుకు గరిష్టంగా 10లక్షల రూపాయల వరకు సహాయం అందజేయనున్నారు. తాము తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్, బ్రాండింగ్ చేయాలనుకుంటే 50శాతం సబ్సిడీతో సహాయం లభించనుంది. ఈ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజస్ స్కీమ్ ద్వారా 35వేల కోట్ల పెట్టుబడులతోపాటు, 9లక్షల మందికి ఉపాధి దక్కుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది.పిఎంఎఫ్ఎమ్ఈ పధకం క్రింద 2020 నుండి 2025వరకు 5సంవత్సరాల కాలంలో 10వేల కోట్లు ఈ స్కీమ్ క్రింద ఖర్చుచేయాలన్న ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అయ్యే ఖర్చులో కేంద్రం 60శాతం వాటాను, రాష్ట్రాలు 40శాతం పంచుకోనున్నాయి.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉన్నవారు https://pmfme.mofpi.gov.in/pmfme/ వెబ్ సైట్ ద్వారా అన్ లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లా స్ధాయిలో రిసోర్స్ పర్సన్ లు యూనిట్ల ఏర్పాటుకు సంబంధించిన డిపిఆర్ లను తయారు చేసి , రుణంసదపాయంతోపాటు, ఇతర విషయాలకు సంబంధించిన సమాచారాన్ని అందజేస్తారు. యూనిట్లకోసం వెబ్ సైట్ లో ధరఖాస్తు చేయటంతోపాటు, జిల్లా నోడల్ అధికారికి ధరఖాస్తు, డిపిఆర్ ను అందించాల్సి ఉంటుంది.
#OneYearofPMFMEScheme | The @PMFMEScheme support clusters & groups such as FPOs, Self Help Groups, and producer cooperatives along with their entire value chain storage, common processing, marketing, and many more. pic.twitter.com/YyeNNKXPJZ
— FOOD PROCESSING MIN (@MOFPI_GOI) July 31, 2021