Booster Dose : బూస్టర్ డోస్ తో కొత్త వేరియంట్లకు చెక్
ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లు ప్రభావవంతంగానే పనిచేస్తున్నా, అయితే ఇవి కల్పిస్తున్న రక్షణ ఎంతకాలం ఉటుందన్నది స్ఫష్టతలేదు.

Covid
Booster Dose : కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఎంతో మంది దీని వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఒకవైపు కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లు టీకాకు లొంగని పరిస్ధితి నెలకొంది. వ్యాక్సిన్ వేయించుకున్న వారు సైతం తిరిగి వ్యాధి బారిన పడుతుండటం అందరిని కలవరపాటుకు గురిచేస్తుంది. దీంతో వ్యాక్సిన్ల వేసుకోవటం ద్వారా వైరస్ నుండి కలిగే రక్షణపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఈ నేపధ్యంలో బూస్టర్ డోస్ అవసరతపై ఇప్పటికే శాస్త్రవేత్తలు పరిశోధనలను వేగంగా కొనసాగిస్తున్నారు. యూనివర్శిటీ ఆప్ వర్జీనియాకు చెందిన మైక్రో బయాలజిస్ట్ విలియం పెట్రి బూస్టర్ డోస్ కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చపై సవివరమైన వివరాలను అందించారు. బూస్టర్ డోస్ ఇవ్వటం అవసరమా…ఇస్తే ఎవరికి ఇవ్వాలి..దీని వల్ల వచ్చే ఫలితం ఏమిటి అన్న విషయాలను విలియం పెట్రి తెలియజేశారు. వివరాలు ఆయన మాటల్లో
మానవదేహంలో రోగ నిరోధక శక్తి క్రమేపి తగ్గిపోతుంది. వ్యాక్సిన్ వేసుకోవటం ద్వారా ఇమ్యూనిటీ లభించినప్పటికీ రోగ నిరోధక శక్తి తగ్గిపోవటం జరుగుతుంది. ఇలాంటి వారికి బూస్టర్ డోసులు ఎంతగానో ఉపయోగపడతాయిని విలియం పెట్రి అంటున్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికి ప్రస్తుతం పుట్టుకువస్తున్న కొత్త వేరియంట్లను సైతం ఎదుర్కొనేలా ఈ బూస్టర్ డోసు సమర్ధవంతంగా తయారు చేస్తారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లు ప్రభావవంతంగానే పనిచేస్తున్నా, అయితే ఇవి కల్పిస్తున్న రక్షణ ఎంతకాలం ఉటుందన్నది స్ఫష్టతలేదు. కరోనా వ్యాప్తిని అడ్డుకోలేకపోయినా శరీరంలోకి ప్రవేశించే వైరస్ నుండి కొన్ని టీకాలు రక్షణ నిలుస్తున్నట్లు అధ్యయనాల్లో తేలిందని విలియం పెట్రి అన్నారు. డెల్టా రకం పై ఫైజర్ టీకా 88శాతం సామర్ధ్యంతో పనిచేయగా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకా బీటా వేరియంట్ పై 73శాతం నుండి 82శాతం వరకు సమర్ధవంతంగా పనిచేసినట్లు తెలింది.
అవయవ మార్పిడి బాధితుల్లో కోవిడ్ యాంటీబాడీల ఉత్పత్తి కావటంలేదని ఫలితాల్లో నిర్ధారించారు. కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారిలో 40మందిలో 39 మందికి టీకా తీసుకున్న యాంటీ బాడీల ఉత్పత్తి జరగకపోవటాన్ని గుర్తించారు. ఫైజర్ , మోడెర్నా వ్యాక్సిన్స్ తీసుకున్న అవయవమార్పిడి బాధితుల్లో బూస్టర్ డోసు తీసుకున్నతరువాత యాండీబాడీల ఉత్పత్తి జరిగినట్లు కనుగొన్నారు.
బూస్టర్ డోసుగా తీసుకునే టీకా విషయంలో మొదటి డోసు టీకానే బూస్టర్ డోసుగా తీసుకోవాల్సిన విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి. అయితే ఫైజర్ , మోడెర్నా వంటి ఆర్ ఎన్ ఏ టీకాలను, అస్ట్రాజెనికా వంటి అడినో వైరస్ టీకాలతో కలసి తీసుకోవచ్చని విలియం పెట్రి అంటున్నారు. దీని వల్ల టీకాల పనితీరులో ఎలాంటి మార్పు ఉండదు. 80ఏళ్ళ పైబడిన వారిలో యాంటీ బాడీలు త్వరగా తగ్గిపోవటం వల్ల కొత్త వేరియంట్లు ఎక్కవగా వచ్చే ప్రమాదం ఉన్నందున వీరికి బూస్టర్ డోసు ఇచ్చే అంశాని పరిశీలించాలని విలియం పెట్రి తెలిపారు.