Lorry in Danger: మ్యాప్స్ ను నమ్ముకుని వెళ్లి కొండ అంచుల్లో చిక్కుకున్న లారీ డ్రైవర్

నావిగేషన్(ఫోన్ మ్యాప్స్)ను నమ్ముకున్న ఒక లారీ డ్రైవర్ దాని సూచనల ప్రకారం వాహనాన్ని నడిపి చివరకు.. ప్రమాద అంచుల వద్దకు వెళ్ళాడు

Lorry in Danger: మ్యాప్స్ ను నమ్ముకుని వెళ్లి కొండ అంచుల్లో చిక్కుకున్న లారీ డ్రైవర్

Lorry

Updated On : January 9, 2022 / 1:36 PM IST

Lorry in Danger: నావిగేషన్(ఫోన్ మ్యాప్స్)ను నమ్ముకున్న ఒక లారీ డ్రైవర్ దాని సూచనల ప్రకారం వాహనాన్ని నడిపి చివరకు.. ప్రమాద అంచుల వద్దకు వెళ్ళాడు. కాదు కాదు కొండ అంచులకు వెళ్ళాడు. కొండలు పర్వతాల గుండా ప్రయాణించేటప్పుడు వాహనదారులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎత్తైన ప్రాంతాల్లో రహదారి సరిగా ఉండదు. దానికి తోడు భారీ మలుపులు ఉంటాయి. అందుకే కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు లారీ డ్రైవర్లు ఎంతో అప్రమత్తంగా ఉంటారు. చైనాలోని చాంగీ ప్రాంతంలో ఒక భారీ లారీని నడుపుతున్న డ్రైవర్..రోడ్డు పై అవగాహన లేకపోవడంతో నావిగేషన్ ను అనుసరించి డ్రైవింగ్ చేస్తున్నాడు. బాగా ఎత్తైన పర్వతాల గుండా లారీ నడుపుతున్నాడు. ముందుకు వెళ్లేకొద్దీ రోడ్డు చాలా ఇరుకుగా తయారైంది.

Also read: Lovebirds Threat: జ్యోతుల నెహ్రూ అనుచరుల నుండి ప్రాణహాని ఉంది: ప్రేమ జంట

దీంతో ముందుకు వెళ్లలేని లారీ డ్రైవర్..వాహనాన్ని వెనక్కు తిప్పుకుని వెళ్లేందుకు ప్రయత్నించాడు. సన్నని ఘాట్ రోడ్డుపై లారీ తిప్పేందుకు వీలు లేకపోవడంతో లారీ రోడ్డు పక్కకు ఒరిగింది. దాదాపు 330 అడుగుల ఎత్తున్న కొండ అంచున లారీ వేలాడింది. లారీ డ్రైవర్.. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా లారీతో సహా లోయలోకి పడిపోయే ప్రమాదం ఉంది. లారీలో ఉన్న మరో నలుగురు వ్యక్తుల ప్రాణాలకే ప్రమాదం ఉంది. ఇది గమనించిన మిగతా వాహనదారులు అధికారులకు సమాచారం అందించారు. మూడు రోజుల పాటు తీవ్రంగా శ్రమించిన అధికారులు లారీని క్షేమంగా బయటకు తీశారు.

Also read: Crime News: దండుపాళ్యన్ని మించిన కర్నూలు గ్యాంగ్, వివరాలు వెల్లడించిన ఎస్పీ విశాల్

రోడ్డుపై అవగాహన లేకుండా కొండ ప్రాంతానికి వచ్చిన లారీ డ్రైవర్ ను అక్కడున్నవారు మందలించారు. అయితే ఇందులో తన తప్పిదం ఏమి లేదని.. కేవలం జీపీఎస్ నావిగేషన్ ను అనుసరించడంతో ఇలా జరిగిందంటూ బాధిత లారీ డ్రైవర్ అధికారులకు వివరించాడు. ఇక ఈఘటనను రోడ్డుకు ఆవలి వైపునున్న కొందరు వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది సూపర్ వైరల్ అయింది.

Also read: Luxury Naxalites: నక్సల్స్ వద్ద ఆ కార్లను చూసి బిత్తరపోయిన పోలీసులు