Luxury Naxalites: నక్సల్స్ వద్ద ఆ కార్లను చూసి బిత్తరపోయిన పోలీసులు

నక్సల్స్ వద్దనున్న బీఎండబ్ల్యూ వంటి విలాసవంతమైన కార్లను చూసి పోలీసులే అవాక్కయ్యారు.

Luxury Naxalites: నక్సల్స్ వద్ద ఆ కార్లను చూసి బిత్తరపోయిన పోలీసులు

Naxals

Luxury Naxalites: నక్సలైట్ అంటే.. అడవుల్లో ఉండి, తుపాకీ చేతపట్టి, పోలీసులు, ప్రభుత్వాలపై పోరాటాలు చేస్తుంటారనే ఇప్పటివరకు చూశాం. కానీ అందుకు బిన్నంగా.. విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు కొందరు నక్సల్స్. వారి వద్దనున్న బీఎండబ్ల్యూ వంటి విలాసవంతమైన కార్లను చూసి పోలీసులే అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఝార్ఖండ్ లోని రాంచీలో రింగ్ రోడ్డు వద్దనున్న ఓ హోటల్ నక్సలైట్స్ ఉన్నారన్న సమాచారం మేరకు రాంచీ సీనియర్ ఎస్పీ సురేంద్ర ఝా.. తన సిబ్బందితో కలిసి హోటల్ పై దాడి నిర్వహించారు. హోటల్ గదిలో ఉన్న నక్సల్స్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారు అనుభవిస్తున్న లగ్జరీ జీవితాన్ని చూసి ఆశ్చర్యపోయారు.

Also Read: Road Accident: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ను బలిగొన్న టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం

దాడి సందర్భంగా పట్టుబడిన అమీర్‌చంద్ కుమార్, ఆర్య కుమార్ సింగ్, ఉజ్వల్ కుమార్ సాహు అనే ముగ్గురు నక్సల్స్.. పీపుల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా PLFI దళానికి చెందిన సభ్యులుగా గుర్తించారు. వీరి వద్ద రూ.50 లక్షల విలువైన బీఎండబ్ల్యూ, రూ.17 లక్షల విలువైన థార్, వంటి డజనుకు పైగా లగ్జరీ కార్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురు నక్సల్స్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..వారి నుంచి 12 కార్లు సహా రూ.3.5 లక్షల నగదు, 5 సిమ్ కార్డులు, టెంట్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జనజీవనంలో సంచరిస్తున్న వీరికి.. నివేష్ కుమార్, ధువర్ సింగ్ మరియు శుభమ్ కుమార్ అనే ముగ్గురు వ్యక్తులు.. నిత్యావసరాలు, ఆయుధాలు సరఫరా చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. పరారీలో ఉన్న ఆ ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు ధారువ జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.

Also read: Google Issue: గూగుల్ పై విచారణకు ఆదేశించిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)

ప్రముఖులను, సంపన్నులను బెదిరించి వీరు ఈ అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన వారిని విచారిస్తే PLFI దళం గురించి మరింత సమాచారం రాబట్టవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే కార్ల నెంబర్ ప్లేట్లు వివిధ రాష్ట్రాలకు చెందినవిగా ఉండడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కార్లు పంజాబ్ రాష్ట్ర రిజిస్ట్రేషన్ తో ఉండగా, మరికొన్ని బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల రిజిస్ట్రేషన్ కలిగివున్నాయి. వీరు ఆయా రాష్ట్రాల నుంచి కార్లను కొనుగోలు చేశారా? లేక అక్కడ ఎవరినైనా బెదిరించి తీసుకొచ్చారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read: Anand Mahindra: ట్విట్టర్ యూజర్ ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా అదిరిపోయే సమాధానం