Google Issue: గూగుల్ పై విచారణకు ఆదేశించిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)

తమ వెబ్ సైట్లపై ఎంతో కష్టపడి పనిచేసి, మంచి వార్తలు ప్రచురించినా.. ఆవార్తలకు గూగుల్ నుంచి వచ్చే ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటుందని DNPA సమాఖ్య సభ్యులు ఆరోపించారు

Google Issue: గూగుల్ పై విచారణకు ఆదేశించిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)

Cci

Google Issue: డిజిటల్ వార్తల ప్రచురణలు(Web News), ఆన్లైన్ యాడ్ రెవిన్యూ పంపకాల్లో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని పేర్కొంటూ డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్(DNPA).. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI)ను ఆశ్రయించింది. ఈమేరకు గూగుల్ సంస్థ చర్యలపై సీసీఐ విచారణకు ఆదేశించింది. భారత్ లో ఫెయిర్ ట్రేడ్ పాలసీలను ధిక్కరించిన యాపిల్ సంస్థపై విచారణకు ఆదేశించిన వారం వ్యవధిలోనే గూగుల్ పై విచారణకు ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో.. వార్తలు, ప్రచురణకర్తలు, ప్రసార మాధ్యమాలు ప్రముఖ పాత్రను పోషిస్తాయని.. అటువంటి వ్యవస్థలపై పెత్తనం చెలాయించడం వారి లాభాలకు అడ్డుకట్ట వేయడం.. కాంపిటీషన్ యాక్ట్, 2002 సెక్షన్ 4 ప్రకారం పూర్తిగా చట్టవిరుద్ధమని సీసీఐ పేర్కొంది.

Also Read: Anand Mahindra: ట్విట్టర్ యూజర్ ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా అదిరిపోయే సమాధానం

కాగా, ఇంటర్నెట్/వరల్డ్ వైడ్ వెబ్ ఆధారంగా పనిచేసే డిజిటల్ న్యూస్ ప్రసార మాధ్యమాలకు..పాఠకులకు మధ్య.. సెర్చ్ ఇంజిన్ లు ప్రవేశ ద్వారాలుగా పనిచేస్తాయి. ఈక్రమంలో గూగుల్ న్యూస్, గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో అనుకూలధోరణి ఉంటుందని DNPA ప్రధాన ఆరోపణ. తమ వెబ్ సైట్ లకు పాఠకులను(Web Traffic) ఆహ్వానించేందుకు ఉన్న ఏకైక మార్గం గూగుల్ కావడంతో.. గూగుల్ ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుందని పిటిషన్ దారులు పేర్కొన్నారు. వెబ్ ట్రాఫిక్ లో 50 శాతానికి పైగా గూగుల్ నుంచి వస్తుండగా..గూగుల్ ఆయా వెబ్ సైట్లలో యాడ్స్ పోస్ట్ చేస్తుంటుంది. వెబ్ సైట్లకు యాడ్ రెవిన్యూ ప్రధానంగా గూగుల్ నుంచే వస్తుంటుంది. దింతో గూగుల్ విధించిన నిబంధనలు మరియు షరతులను అంగీకరించడం తప్ప వార్తల ప్రచురణకర్తలకు వేరే మార్గం లేకపోయింది. ఒక వేళ గూగుల్ కాదని ట్రాఫిక్ ను వదులుకుంటే తమ ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉందని అసోసియేషన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: Air Force Officer: కత్తితో పొడిచి ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ హత్య

తమ తమ వెబ్ సైట్లపై ఎంతో కష్టపడి పనిచేసి, మంచి వార్తలు ప్రచురించినా.. ఆవార్తలకు గూగుల్ నుంచి వచ్చే ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటుందని సమాఖ్య సభ్యులు ఆరోపించారు. గూగుల్ సెర్చ్ అల్గోరిథం కారణంగా.. వెబ్ సైట్ ఇండెక్స్ లోనూ తేడాలు వస్తున్నాయన్న సభ్యులు, గూగుల్ తమకు అనువైన వెబ్ సైట్లనే సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్స్ లో చూపిస్తుందని ఆరోపించారు. గూగుల్ వద్ద ఎక్కువ యాడ్స్ ఉన్నా.. అవి సరిసమానంగా రావడంలేదని.. తద్వారా రెవిన్యూ పంపకాల్లో గణనీయమైన తేడాలు వస్తున్నట్లు DNPA పేర్కొంది. ఆన్‌లైన్ డిజిటల్ అడ్వర్టైజింగ్ మధ్యవర్తిత్వ సేవల్లో పారదర్శకత లోపించిందని, దీని వల్ల వెబ్‌సైట్‌లలో వచ్చే యాడ్ రెవిన్యూని పక్కాగా ద్రువీకరించి ఆడిట్ చేయడం కష్టతరంగా ఉందని డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ తెలిపింది.

Also read: India-America: అమెరికాకు మన మామిడి, దానిమ్మ, అక్కడి నుంచి మనకు గడ్డి దిగుమతి

ఇక DNPA సభ్యుల ఫిర్యాదు స్పందించిన CCI..గూగుల్ పై విచారణకు ఆదేశించింది. డిజిటల్ వార్తా పబ్లిషర్‌లపై Google వివక్షతతో కూడిన షరతులు, ధరలను విధిస్తుందా అనేకోణంలో విచారణ చేపట్టనున్నారు. ఈ వ్యవహారంలో విచారణ జరిపి 60 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సీసీఐలో విచారణ విభాగానికి చెందిన డైరెక్టర్ జనరల్ ను ఆదేశించింది.