Ind vs AUS 4th T20 : టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. భార‌త్ బ్యాటింగ్‌.. తుది జ‌ట్టులో నాలుగు మార్పులు

నాలుగో టీ20 మ్యాచ్‌లో ( Ind vs AUS 4th T20) టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

Ind vs AUS 4th T20 : టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. భార‌త్ బ్యాటింగ్‌.. తుది జ‌ట్టులో నాలుగు మార్పులు

Ind vs AUS 4th T20 Australia have won the toss and have opted to field

Updated On : November 6, 2025 / 1:31 PM IST

Ind vs AUS 4th T20 : ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య క్వీన్స్‌ల్యాండ్‌లోని కరారా ఓవల్ వేదిక‌గా నాలుగో టీ20 మ్యాచ్ ప్రారంభ‌మైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భార‌త్ తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది.

ప్ర‌స్తుతానికి సిరీస్ 1-1తో స‌మంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకువెళ్లాల‌ని ఇరు జ‌ట్లు భావిస్తున్నాయి.

‘మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. ఈ మైదానంలో మేం ఎక్కువ మ్యాచ్‌లు ఆడ‌లేదు. పిచ్ చూసేందుకు బాగుంది. బ్యాటింగ్ పిచ్‌ల అనిపిస్తుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో చివ‌రి రెండు మ్యాచ్‌ల‌కు వ‌చ్చేశాము. రెండు జ‌ట్లు ఉత్సాహంగా ఉన్నాయి. తుది జ‌ట్టులో నాలుగు మార్పులు చోటు చేసుకున్నాయి. జంపా, మాక్స్‌వెల్, ఫిలిప్, డ్వార్షియస్ జట్టులోకి వచ్చారు.’ అని మిచెల్ మార్ష్ అన్నాడు.

IND vs AUS 4th T20 : ఆస్ట్రేలియాతో నాలుగో టీ20 మ్యాచ్‌.. కెరీర్ మైల్ స్టోన్స్‌ పై సంజూ శాంస‌న్‌, తిల‌క్ వ‌ర్మ క‌న్ను..

‘పిచ్ బాగుంది. ఉప‌ఖండ వికెట్‌లాగా అనిపిస్తోంది. ఆట సాగే కొద్ది పిచ్ నెమ్మ‌దిగా మార‌వ‌చ్చు. తొలుత బ్యాటింగ్ చేయ‌డం ప‌ట్ల ఆనందంగా ఉన్నాము. టాస్ గెలిచినా కూడా తొలుత బ్యాటింగ్ చేయాల‌ని అనుకున్నాం. ఈ మైదానంలో..  భార‌త దేశంలోని ప‌రిస్థితులు పోలి ఉన్నాయి. భారీ స్కోరు చేసి ప్ర‌త్య‌ర్థికి ఒత్తిడిలోకి నెడ‌తామ‌ని ఆశిస్తున్నాము. తుది జ‌ట్టులో ఎలాంటి మార్పులు చేయ‌డం లేదు.’ అని సూర్య‌కుమార్ యాద‌వ్ అన్నాడు.

ఆస్ట్రేలియా తుది జ‌ట్టు..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్ (w), టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా

Abhishek Sharma : ఆస్ట్రేలియాతో నాలుగో టీ20 మ్యాచ్‌.. విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డు పై అభిషేక్ శ‌ర్మ క‌న్ను..


భార‌త తుది జ‌ట్టు..
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జితేష్ శర్మ(వికెట్ కీప‌ర్‌), శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జ‌స్‌ప్రీత్ బుమ్రా